మనిక బాత్రాకు షాకిచ్చిన టీటీఎఫ్‌ఐ

Manika Batra Left Out Of India Squad For Asian TT Championships - Sakshi

న్యూఢిల్లీ: భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) స్టార్‌ ప్లేయర్‌ మనిక బాత్రాకు ఊహించని షాకిచ్చింది. భారత జట్టు నుంచి తప్పించింది. దోహాలో ఈ నెల 28 నుంచి జరగాల్సిన ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో అమెను ఎంపిక చేయలేదు. సోనెపట్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన జాతీయ శిక్షణ శిబిరానికి గైర్హాజరు కావడం వల్లే ఆమెపై వేటు వేసినట్లు టీటీఎఫ్‌ఐ వర్గాలు తెలిపాయి.

56వ ప్రపంచ ర్యాంకర్‌ మనికను తప్పించడంతో 97వ ర్యాంకర్‌ సుతీర్థ ముఖర్జీ మహిళల జట్టును నడిపించనుంది. ఈ జట్టులో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ, ఐహిక ముఖర్జీ (131వ ర్యాంకు), అర్చన కామత్‌ (132వ ర్యాంకు) ఉన్నారు. పురుషుల జట్టులో వెటరన్‌ శరత్‌ కమల్‌ (33వ రాం్యకర్‌), సత్యన్‌ (38), హరీ్మత్‌ దేశాయ్‌ (72), మానవ్‌ ఠక్కర్‌ (134), సానిల్‌ శెట్టి (247) ఎంపికయ్యారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top