కుల్దీప్‌ ఇక సెలవు, బ్యాగ్‌ సర్దుకో! | Kuldeep Yadav Trolled for Clueless Spell Against England | Sakshi
Sakshi News home page

కుల్దీప్‌ ఇక సెలవు, బ్యాగ్‌ సర్దుకో!

Mar 27 2021 1:08 PM | Updated on Mar 27 2021 2:00 PM

Kuldeep Yadav Trolled for Clueless Spell Against England - Sakshi

స్టోక్స్, బెయిర్‌స్టో జోరుకు అతను బలయ్యాడు. భారీగా పరుగులు ఇచ్చిన ఒత్తిడిలో తన ఫీల్డింగ్‌ వైఫల్యాలు అతడిని మరింత బాధపడేలా చేశాయి.

పుణే: భారత్‌తో వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్‌ 1–1తో సమం చేసింది. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిన్నటి మ్యాచ్‌లో తొలి బంతి నుంచే చెలరేగిన బెన్‌ స్టోక్స్‌ను నిలువరించడం భారత బౌలర్ల వల్ల కాలేదు. తొలి మూడు సిక్సర్లు కృనాల్‌ బౌలింగ్‌లోనే కొట్టిన స్టోక్స్‌ 32 పరుగుల వద్ద రనౌట్‌ కాకుండా తప్పించుకున్నాడు. అనంతరం దూకుడు పెంచి కుల్దీప్‌ ఓవర్లో ఒక సిక్స్‌, ఫోర్‌ బాది 40 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్కును చేరుకున్నాడు.

తర్వాత కూడా కుల్దీప్‌ బౌలింగ్‌లో ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగిపోయి ఆడారు. నిన్నటి మ్యాచ్‌ ఈ చైనామన్‌ బౌలర్కు ఏమాత్రం కలిసి రాలేదని చెప్పొచ్చు. స్టోక్స్, బెయిర్‌స్టో జోరుకు అతను బలయ్యాడు. భారీగా పరుగులు ఇచ్చిన ఒత్తిడిలో తన ఫీల్డింగ్‌ వైఫల్యాలు అతడిని మరింత బాధపడేలా చేశాయి. తన తొలి 6 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఫరవాలేదనిపించిన కుల్దీప్‌ తర్వాతి నాలుగు ఓవర్లలో వరుసగా 8, 17, 20, 7 (మొత్తం 84) చొప్పున పరుగులిచ్చి ఉసూరుమనిపించాడు. ఇక భారీ పరుగుల మ్యాచ్‌లో ఓటమి ఎదురవడంతో టీమిండియా అభిమానులు కొందరు కుల్దీప్‌పై ట్రోలింగ్‌ షురూ చేశారు.

బాబూ నీ సేవలు ఇక చాలు.. బ్యాగ్‌ సర్దుకో అంటూ కామెంట్లు‌ చేస్తున్నారు. కుల్దీప్‌ యాదవ్‌ పర్ఫామెన్స్‌ విత్‌ ధోని.. వితౌట్‌ ధోని అంటూ స్క్రీన్‌ షాట్లు షేర్‌ చేస్తుండగా.. మరి కొందరు ‘‘టీమిండియాలో ఒక్క వికెట్‌ కూడా తీయకుండా.. బాగా ఏడ్చే అరుదైన రికార్డు కుల్దీప్‌కే సొంతం’’.. ‘‘బెన్‌స్టోక్స్‌ ఇద్దరు ఇండియన్‌ ప్లేయర్ల కెరీర్‌ని డేంజర్‌లో పడేశాడు. వారిద్దరు ఎవరంటే కుల్దీప్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్యా’’.. ‘‘కృనాల్‌ పాండ్యా లాంటి ఆటగాడితో.. రోహిత్‌ ఐపీఎల్‌లో విజయం సాధించాడు. ఈ సాహసానికి గాను రోహిత్‌కి మరో ట్రోఫి ఇ‍చ్చినా తప్పు లేదు’’ అంటూ మరికొందరు నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

చదవండి: ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత తొలి వికెట్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement