రెండోసారి ఛాంపియన్‌గా సన్‌రైజర్స్.. ఎగిరి గంతేసిన కావ్య పాప! వీడియో వైరల్‌ | Kavya Maran Celebration After Sunrisers Eastern Cape Win SA20 2024 Title, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

SA20 2024 - Kavya Maran Celebration: రెండోసారి ఛాంపియన్‌గా సన్‌రైజర్స్.. ఎగిరి గంతేసిన కావ్య పాప! వీడియో వైరల్‌

Published Sun, Feb 11 2024 9:20 AM

Kavya Marans Celebration After Sunrisers Eastern Cape Win SA20 2024 Title Goes Viral - Sakshi

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2024 విజేతగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది. శనివారం కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన ఫైనల్లో డర్బన్ సూపర్ జెయింట్ 89 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ చిత్తు చేసింది. తద్వారా వరుసగా రెండోసారి దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ ఛాంపియన్‌గా సన్‌రైజర్స్‌ అవతరించింది. టోర్నీ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన ఈస్టర్న్ కేప్.. తుదిపోరులోనే తమకు తిరుగులేదని నిరూపించుకుంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ ట్రిస్టన్ స్టబ్స్(30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56), టామ్ అబెల్(34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అనంతరం లక్ష్య ఛేదనలో డర్బన్ సూపర్ జెయింట్ కేవలం 115 పరుగులకే ఆలౌటైంది.

కావ్య పాప సెలబ్రేషన్స్‌.. 
ఇక ఈ విజయం నేపథ్యంలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ సంబరాలు అంబరాలను అంటాయి. డర్బన్‌ ఆఖరి వికెట్‌ రీస్‌ టోప్లీ ఔట్‌ అవ్వగానే కావ్య పాప ఎగిరి గంతేసింది. వెంటనే మైదానంలో వచ్చి తమ జట్టు ఆటగాళ్లను కావ్య అభినంధించింది. అంతకముందు సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ సమయంలో కూడా బౌండరీలు బాదిన ప్రతీసారి కావ్య స్టాండ్స్‌లో నుంచి చప్పట్లు కొడుతూ ప్రోత్సహించింది.

ఆ తర్వాత మైదానంలో కావ్య మాట్లాడుతూ.. రెండో సారి ఛాంపియన్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. కావ్య సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్‌లో కూడా కావ్య స్టేడియాల్లో సందడి చేస్తూ ఉంటుంది.
చదవండి: SA20 2024: సన్‌రైజర్స్ సంచలనం.. వరుసగా రెండో సారి ఛాంపియన్స్‌గా]

Advertisement
 
Advertisement
 
Advertisement