
Photo Courtesy: BCCI
గుజరాత్ టైటాన్స్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ (Jos Buttler) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యధిక పరుగులు సాధించిన ఇంగ్లండ్ బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం నాటి మ్యాచ్ సందర్భంగా బట్లర్ ఈ ఘనత సాధించాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు.
సాయి 23 బంతుల్లో 48 పరుగులు చేసి అవుట్ కాగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ క్రీజులోకి వచ్చాడు. గిల్ (38 బంతుల్లో 76)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బట్లర్ 37 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 64 పరుగులు రాబట్టాడు.
4000 పరుగుల మైలురాయి
అయితే, సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇవ్వడంతో బట్లర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన బట్లర్.. ఐపీఎల్ కెరీర్‌లో 4000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్‌గా బట్లర్ చరిత్రకెక్కాడు. అంతేకాదు.. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా (తక్కువ బంతుల్లోనే) ఈ మార్కు అందుకున్న మూడో బ్యాటర్‌గా.. అదే విధంగా.. తక్కువ ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయి అందుకున్న నాలుగో క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. కాగా బట్లర్ గతంలో ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
ఐపీఎల్‌లో తక్కువ బంతుల్లోనే 4000 పరుగుల మార్కు అందుకున్న క్రికెటర్లు
👉క్రిస్ గేల్ (వెస్టిండీస్)- 2658 బంతుల్లో
👉ఏబీ డివిలియర్స్ (సౌతాఫ్రికా)- 2658 బంతుల్లో
👉జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 2677 బంతుల్లో
👉సూర్యకుమార్ యాదవ్ (ఇండియా)- 2714 బంతుల్లో..
ఐపీఎల్‌లో తక్కువ ఇన్నింగ్స్‌లో నాలుగు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్లు
👉కేఎల్ రాహుల్ (ఇండియా)- 105 ఇన్నింగ్స్‌లో
👉క్రిస్ గేల్ (వెస్టిండీస్)- 112 ఇన్నింగ్స్‌లో
👉డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 114 ఇన్నింగ్స్‌లో
👉జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 116 ఇన్నింగ్స్‌లో
👉ఫాఫ్ డుప్లెసిస్ (సౌతాఫ్రికా)- 121 ఇన్నింగ్స్‌లో
👉విరాట్ కోహ్లి (ఇండియా)- 128 ఇన్నింగ్స్‌లో.
ఇక గుజరాత్- హైదరాబాద్ మ్యాచ్ విషయానికొస్తే.. సాయి, గిల్, బట్లర్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా గుజరాత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా గుజరాత్ 38 పరుగులు తేడాతో జయభేరి మోగించింది.
చదవండి: Shubman Gill: అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని!
How’s the JOS? Quite high, indeed! 🙌🏻🔥#JosButtler continued his stellar IPL form with another fifty as #GT push towards a massive first-innings total!
Watch the LIVE action ➡ https://t.co/RucOdyBo4H#IPLonJioStar 👉 #GTvSRH | LIVE NOW on SS-1, SS- 1 Hindi & JioHotstar! pic.twitter.com/sUDd0x9erf— Star Sports (@StarSportsIndia) May 2, 2025