Wasim Jaffer: 'తప్పును భూతద్ధంలో పెట్టి చూస్తున్నారు'.. దిమ్మతిరిగే కౌంటర్‌

Jaffer Trolls English Media-Players Deepti Sharma-Run-out Controversy - Sakshi

టీమిండియా   మహిళా  క్రికెటర్ దీప్తి శర్మ ఇటీవల లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో వన్డేలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్ చార్లీ డీన్ ను రనౌట్ (మన్కడింగ్‌)చేసిన విషయం తెలిసిందే. మన్కడింగ్‌ చట్టబద్ధం చేసినప్పటికి.. ఇంగ్లీష్‌ మీడియా సహా అక్కడి క్రికెటర్లు మాత్రం దీప్తి శర్మ ఏదో పెద్ద నేరం చేసినట్లుగా చెప్పుకుంటున్నారు.

క్రికెట్ చట్టాల్లో ఈ నిబంధన ఉన్నా ఇలా ఔట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ తమ వెర్రితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో  భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఒక్క ట్వీట్‌తో ఇంగ్లీష్ మీడియా, క్రికెటర్లు,విశ్లేషకులు,విమర్శకుల నోళ్లు మూయించాడు. తాజాగా  షేర్‌ చేసిన వీడియోలో ఇటాలియన్ సైక్లిస్టు మైఖేల్ గరియాకు సంబంధించిన ఓ వీడియో ఉంటుంది. 

ఆ వీడియోలో ఇటాలియన్ సైక్లిస్టు  మైఖేల్ గరియా..తన ముందున్న వారిని దాటేయడానికి గాను  సైకిల్‌ను వేగంగా తొక్కి తర్వాత తన బాడీని  సీట్ మీద ఫ్లాంక్ పొజిషన్ లో ఉంచుతాడు.దీంతో సైకిల్.. తన ముందున్న  సైకిళ్లను దాటేసుకుంటూ ముందుకు వెళ్తుంది. 

ఈ  వీడియోను  జాఫర్ రీట్వీట్ చేస్తూ.. ''ఇది (గరియా చేసిన పని) వాస్తవానికి చట్టబద్దమైనదే కావచ్చు. నిబంధనల్లో ఉండొచ్చు. కానీ  ఇది సైక్లింగ్ స్ఫూర్తికి విరుద్ధం.. అని ఇ ఓ ఇంగ్లీష్ సైక్లిస్టు చెప్పాడు.తప్పును భూతద్ధంలో పెట్టి చూస్తున్నారు'' అని  రాసుకొచ్చాడు. పేరు చెప్పకపోయినా జాఫర్  ట్వీట్ ద్వారా ఇంగ్లీష్ మీడియా,క్రికెటర్ల వ్యాఖ్యలకు కౌంటరిచ్చినట్టేనని స్పష్టమవుతున్నది.

చదవండి: ధోని కొత్త అవతారం.. వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top