శివాజీనగర: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 7, 8 వేల సీట్లు స్పాన్సర్లు, ఇతరులకు ఇవ్వాల్సి ఉంటుంది. అది వర్క్‌ఔట్ కాదని ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను మార్చినట్లు తెలిసింది అని హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. ఐపీఎల్ ఫైనల్స్‌ను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు మార్చడంపై గురువారం నగరంలో స్పందిస్తూ, మ్యాచ్‌కు భద్రత గురించి ఎలాంటి ఫిర్యాదు రాలేదు.
ఇప్పటికి 5 మ్యాచ్‌లు ఇక్కడ జరిగాయని చెప్పారు. చిన్నస్వామిలో 33 వేల సీట్లు ఉన్నాయి. 7– 8 వేల సీట్ల (టికెట్లు)ను స్పాన్సర్లు తదితరులకు ఇవ్వాల్సి ఉంటుంది. 25 వేలు సీట్లు నిర్వాహకులకు మిగులుతాయి, ఇది గిట్టుబాటు కాదని స్టేడియాన్ని మార్చారని నాకు తెలిసిందన్నారు. ఎమ్మెల్యేల ఉచిత టికెట్లకు, దీనికి సంబంధం లేన్నారు. నాలుగు పాస్‌లు ఇస్తే ఏమవుతుంది? అని ప్రశ్నించారు.
వినతి మేరకు సస్పెన్షన్ రద్దు
ఐపీఎస్ రామచంద్రరావు సస్పెన్షన్ రద్దుపై స్పందిస్తూ, సీఎం అనుమతి తీసుకొని రద్దు చేశారు, ఈ నెలాఖరులో ఆయన రిటైరవుతారు, పెన్షన్ సెటిల్మెంటు తదితరాలు ఉన్నాయని, సస్పెన్షన్ ఎత్తేయాలని రామచంద్రరావు సీఎంకు విన్నవించారు, కావాలంటే తరువాత విచారణను కొనసాగించవచ్చని అభ్యరి్థంచారు అని తెలిపారు.


