IPL 2024: ఐపీఎల్‌-17 షెడ్యూల్‌ విడుదల.. తొలి మ్యాచ్‌ ఆ రెండు జట్ల మధ్య

IPL 2024 Schedule Announced Check Full Details - Sakshi

IPL 2024 Schedule Released: క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 షెడ్యూల్‌ విడుదలైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌-   రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మార్చి  22న  చెన్నైలో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది.

మొత్తంగా 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం ప్రకటించారు. సాధారణంగా డిఫెండింగ్‌ చాంపియన్‌- రన్నరప్‌ మధ్య మ్యాచ్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ కొత్త ఎడిషన్‌ ఆరంభించడం ఆనవాయితీ.

ఆ తేదీల్లో డబుల్‌ మ్యాచ్‌లు
అయితే, ఈ సారి అందుకు భిన్నంగా సీఎస్‌కే- గుజరాత్‌ టైటాన్స్‌కు బదులు.. సీఎస్‌కే- ఆర్సీబీతో పదిహేడవ ఎడిషన్‌ మొదలుపెట్టనున్నారు. తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌లో భాగంగా పది జట్లు బరిలో దిగనున్నాయి. మార్చి 22- ఏప్రిల్‌ 7 వరకు ఈ మేరకు 21 ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మార్చి 23, 24, 31, ఏప్రిల్‌7న డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

ఐపీఎల్‌-2024 తొలి 17 రోజుల షెడ్యూల్‌ 
►మార్చి 22- సీఎస్‌కే- ఆర్సీబీ- చెన్నై
►మార్చి 23- పంజాబ్‌ కింగ్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌- మొహాలీ(మధ్యాహ్నం)
►మార్చి 23- కేకేఆర్‌- సన్‌రైజర్స్‌- కోల్‌కతా(రాత్రి)
►మార్చి 24- రాజస్తాన్‌- లక్నో సూపర్‌ జెయింట్స్‌- జైపూర్‌(మధ్యాహ్నం) 
►మార్చి 24- గుజరాత్‌ టైటాన్స్‌- ముంబై ఇండియన్స్‌- అహ్మదాబాద్‌(రాత్రి)

►మార్చి 25- ఆర్సీబీ- పంజాబ్‌- బెంగళూరు
►మార్చి 26- సీఎస్‌కే- గుజరాత్‌- చెన్నై
►మార్చి 27- సన్‌రైజర్స్‌- ముంబై- హైదరాబాద్‌
►మార్చి 28- రాజస్తాన్‌- ఢిల్లీ- జైపూర్‌

►మార్చి 29- ఆర్సీబీ- కేకేఆర్‌- బెంగళూరు
►మార్చి 30- లక్నో- పంజాబ్‌- లక్నోలో
►మార్చి 31- గుజరాత్‌- సన్‌రైజర్స్‌- అహ్మదాబాద్‌(మధ్యాహ్నం)
►మార్చి 31- ఢిల్లీ- సీఎస్‌కే- వైజాగ్‌

►ఏప్రిల్‌ 1- ముంబై- రాజస్తాన్‌- ముంబై
►ఏప్రిల్‌ 2- ఆర్సీబీ- లక్నో- బెంగళూరు
►ఏప్రిల్‌ 3- ఢిల్లీ- కేకేఆర్‌- వైజాగ్‌

►ఏప్రిల్‌ 4- గుజరాత్‌- పంజాబ్‌- అహ్మదాబాద్‌
►ఏప్రిల్‌ 5- సన్‌రైజర్స్‌- సీఎస్‌కే- హైదరాబాద్‌
►ఏప్రిల్‌ 6- రాజస్తాన్‌- ఆర్సీబీ- జైపూర్‌

►ఏప్రిల్‌ 7- ముంబై- ఢిల్లీ- ముంబై
►ఏప్రిల్‌ 7- లక్నో- గుజరాత్‌- లక్నో


Photo Credit: Star Sports X

వేదికలు
చెన్నై, మొహాలి, కోల్‌కతా, జైపూర్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, హైదరాబాద్‌, లక్నో, వైజాగ్‌, ముంబై. తొలి 17 రోజుల షెడ్యూల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వైజాగ్‌ హోం గ్రౌండ్‌గా ఉండనుంది.  ఇక మధ్యాహ్నం 3.30, రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి.

మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే
కాగా ఐపీఎల్‌–2024 పూర్తిగా భారత్‌లోనే నిర్వహించడం ఖాయమైనట్లు లీగ్‌ చైర్మన్‌ అరుణ్‌ ధూమల్‌  నిర్ధారించిన విషయం తెలిసిందే. దీంతో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారత్‌ బయట మ్యాచ్‌లు జరిపే అవకాశాలపై జరిగిన చర్చకు దీంతో తెర పడింది. ‘మార్చి 22 నుంచి ఐపీఎల్‌ ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నాం.

తేదీల విషయంపై మేం ప్రభుత్వ అధికారులతో చర్చిస్తున్నాం. ముందుగా 15 రోజుల మ్యాచ్‌ల షెడ్యూల్‌ విడుదల చేస్తాం. ఆపై తర్వాతి తేదీలను ప్రకటిస్తాం. అయితే అన్ని మ్యాచ్‌లు భారత్‌లోనే జరగడం ఖాయం’ అని ధూమల్‌ స్పష్టం చేశారు. అయితే, గురువారం తొలి 17 రోజుల మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయడం గమనార్హం.

అప్పట్లో ఆ దేశాల్లో నిర్వహణ
కాగా ఐపీఎల్‌ ప్రారంభమైన తర్వాతి ఎన్నికల సమయంలో 2009లో టోర్నీ మొత్తం దక్షిణాఫ్రికాలో జరిగింది. 2014లో కొన్ని మ్యాచ్‌లు భారత్‌లో, మరికొన్ని యూఏఈలో నిర్వహించారు. అయితే 2019లో మాత్రం మొత్తం టోర్నీ ఇక్కడే జరిగింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌ తర్వాత కొద్ది రోజుల్లోనే టి20 ప్రపంచ కప్‌-2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో లీగ్‌ ఫైనల్‌ మే 26న జరిగే అవకాశం ఉంది.  

కళ్లన్నీ వారిద్దరిపైనే
ఐపీఎల్‌ 17వ ఎడిషన్‌లో ప్రధానంగా టీమిండియా స్టార్లు హార్దిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్‌పైనే ఎక్కువ ఫోకస్‌ కానున్నారు. గుజరాత్‌ టైటాన్స్‌ను ఆరంభ సీజన్‌లోనే విజేతగా.. తదుపరి రన్నరప్‌గా నిలిపిన ఆల్‌రౌండర్‌ పాండ్యా.. అనూహ్యంగా ఆ ఫ్రాంఛైజీని వీడాడు.

ముంబై ఇండియన్స్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుని తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు. కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. మరోవైపు.. 2022, డిసెంబరులో ఘోర రోడ్డు  ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషభ్‌ పంత్‌ ఈ సీజన్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథిగా తిరిగి పగ్గాలు చేపట్టనున్నాడు.

Election 2024

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

19-03-2024
Mar 19, 2024, 13:18 IST
ఐపీఎల్‌-204 సీజన్‌కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు గుడ్‌ న్యూస్‌ అందింది. గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమవుతాడనుకున్న బంగ్లాదేశ్‌ స్టార్‌...
19-03-2024
Mar 19, 2024, 12:27 IST
టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ మాజీ సారథి రోహిత్‌ శర్మ ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌ సన్నాహకాలు మొదలుపెట్టాడు. సోమవారమే ముంబై శిబిరానికి...
19-03-2024
Mar 19, 2024, 12:00 IST
ఐపీఎల్‌-2024 సీజన్‌కు మరో రెండు రోజుల్లో తెరలేవనుది. మార్చి 22న చెపాక్‌ వేదికగా తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌,...
19-03-2024
Mar 19, 2024, 10:41 IST
ఐపీఎల్‌-2024లో బౌలింగ్‌ చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అన్నాడు. పేస్‌ దళంలో...
19-03-2024
Mar 19, 2024, 08:56 IST
ఐపీఎల్‌-2024 సీజన్‌ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ ఏడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడే తొలి...
19-03-2024
Mar 19, 2024, 00:37 IST
ఎనిమిది, ఎనిమిది, పది... గత మూడు ఐపీఎల్‌ సీజన్‌ల పాయింట్ల పట్టికలో వరుసగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్థానాలు ఇవి! 2023లోనైతే...
18-03-2024
Mar 18, 2024, 18:54 IST
Virat Kohli joins RCB camp for IPL 2024: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అభిమానులు సంతోషాల్లో మునిగితేలుతున్నారు. వుమెన్‌...
18-03-2024
Mar 18, 2024, 16:04 IST
ఐపీఎల్‌-2024 ఆరంభానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బౌలర్‌, బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌...
18-03-2024
Mar 18, 2024, 15:20 IST
ఐపీఎల్‌-2024 ఆరంభానికి ముందు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హోదాలో...
18-03-2024
Mar 18, 2024, 11:28 IST
IPL 2024- T20 WC 2024: టీమిండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు కష్టమేనని భారత...
18-03-2024
Mar 18, 2024, 09:46 IST
టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఐపీఎల్‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌-2024 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు సర్ఫరాజ్‌...
16-03-2024
Mar 16, 2024, 14:00 IST
ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన క్రికెటర్లలో ధ్రువ్‌ జురెల్ ఒకడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను ఐపీఎల్‌-2022...
16-03-2024
Mar 16, 2024, 12:31 IST
డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు చేదువార్త! ఐపీఎల్‌-2024 ఆరంభ మ్యాచ్‌లకు ఆ జట్టు కీలక బౌలర్‌ దూరం కానున్నట్లు...
23-02-2024
Feb 23, 2024, 09:25 IST
విశాఖ స్పోర్ట్స్‌: వైఎస్సార్‌ స్టేడియం మరోసారి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే నాలుగు జట్లకు హోమ్‌...
23-02-2024
Feb 23, 2024, 04:16 IST
న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) –2024కు అధికారికంగా నగారా మోగింది. మార్చి 22న జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో...
23-02-2024
Feb 23, 2024, 04:14 IST
భారత పేస్‌ బౌలర్‌  షమీ ఎడమ కాలి మడమ గాయం కారణంగా ఐపీఎల్‌–2024 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. గత నెలలో...
22-02-2024
Feb 22, 2024, 20:51 IST
ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌ తొలి షెడ్యూల్‌ను ఇవాళ (ఫిబ్రవరి 22) విడుదల చేశారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలి...
22-02-2024
Feb 22, 2024, 18:37 IST
ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌ తొలి విడత షెడ్యూల్‌ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహకులు 17...
22-02-2024
Feb 22, 2024, 17:58 IST
ఐపీఎల్‌ 2024 తొలి విడత షెడ్యూల్‌ కొద్ది సేపటి క్రితం విడుదలైంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహకులు 17...
07-08-2023
Aug 07, 2023, 16:39 IST
ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రస్తుత హెడ్‌ కోచ్‌, బ్యాటింగ్‌ దిగ్గజం...


 

Read also in:
Back to Top