IPL 2023: Ishan Kishan pull Nehal Wadhera leg after win over RCB - Sakshi
Sakshi News home page

Nehal Wadhera-Ishan Kishan: 'మ్యాచ్‌ గెలిచాం కదా.. ఆ సెలబ్రేషన్‌ అవసరమా?'

May 10 2023 5:22 PM | Updated on May 10 2023 6:09 PM

IPL 2023: Ishan Kishan pull Nehal Wadhera Leg After win over RCB - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ మంగళవారం ఆర్‌సీబీతో మ్యాచ్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. 200 పరుగుల టార్గెట్‌ను 22 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. సూర్యకుమార్‌ 35 బంతుల్లో 83 పరుగులతో సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. నెహాల్‌ వదేరా హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. 

ఇక మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఇషాన్‌ కిషన్‌, నెహాల్‌ వదేరాల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. విజయం అనంతరం వదేరా హెల్మెట్‌ తీసి విజయనాదం చేయడంపై ఇషాన్‌ ప్రశ్నించాడు. ''మ్యాచ్‌లో ముంబై గెలుస్తుందని అందరికి తెలుసు.. ఎందుకంటే అప్పటికే మ్యాచ్‌ మనవైపు మొగ్గింది. అయినా కూడా నువ్వు విన్నింగ్‌ షాట్‌ కొట్టిన తర్వాత గెలుస్తాం అని తెలుసు.. అయినా హెల్మెట్‌ తీసి ఆ గెస్ట్చర్‌ ఎందుకు ఇచ్చావు'' అని అడిగాడు. 

ఇషాన్‌ ప్రశ్నపై వదేరా స్పందిస్తూ.. ''ఆ సమయంలో అలా జరిగిపోయింది. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు విజయనాదం చేస్తూ గట్టిగా అరుస్తుండడంతో తెలియకుండానే నా చేతులు హెల్మెట్‌ వద్దకు వెళ్లడం.. ఒక చేత్తో బ్యాట్‌.. మరొక చేతిలో హెల్మెట్‌ పట్టుకొని అభివాదం చేశాను. మ్యాచ్‌ను దగ్గరుండి గెలిస్తే వచ్చే కిక్కు వేరుగా ఉంటుందని  నీకు తెలియదా'' అని నవ్వుతూ పేర్కొన్నాడు.

ఇక ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఐదు ఓటములతో 12 పాయింట్లతో టాప్‌-మూడో స్థానానికి చేరుకుంది.

చదవండి: ఒక్కసారి కుదురుకుంటే అతడిని ఆపడం ఎవరి తరం కాదు.. మేము కనీసం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement