MI Vs DC IPL 2022: Mumbai Indians Captain Rohit Sharma Fined Rs 12 Lakh - Sakshi
Sakshi News home page

IPL 2022: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు భారీ షాక్‌! మొదటి తప్పిదం కాబట్టి..

Mar 28 2022 9:17 AM | Updated on Mar 28 2022 3:02 PM

IPL 2022 MI Vs DC: Mumbai Indians Captain Rohit Sharma Fined Rs 12 Lakh - Sakshi

ముంబై ఇండియన్స్‌ జట్టు(PC: IPL)

IPL 2022: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు భారీ షాక్‌! మొదటి తప్పిదం కాబట్టి..

IPL 2022 MI Vs DC- Mumbai Indians: ఐపీఎల్‌-2022లో తమ ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో అనూహ్య రీతిలో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఫైన్‌ వేశారు. స్లో ఓవర్‌ రేటు కారణంగా అతడికి 12 లక్షల జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో తమ బౌలింగ్‌ కోటా పూర్తి చేయనందున ముంబై సారథికి ఈ మేర ఫైన్‌ పడింది.

ఈ మేరకు ‘‘ఇది జట్టు మొదటి తప్పిదమైన కారణంగా ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసినందుకు గానూ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌కు 12 లక్షల జరిమానా విధిస్తున్నాం’’ అని ఐపీఎల్‌ తమ ప్రకటనలో పేర్కొంది.

కాగా మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో చివరికి విజయం ఢిల్లీనే వరించింది. 4 వికెట్ల తేడాతో రోహిత్‌ బృందంపై గెలుపొంది ఈ సీజన్‌లో తొలి గెలుపు నమోదు చేసింది ఢిల్లీ. లలిత్ యాదవ్‌, అక్షర్‌ ధనాధన్ ఇన్నింంగ్స్‌తో ఐదుసార్లు చాంపియన్‌ అయిన ముంబైపై పంత్‌ సేన సంచలన విజయం‌ సాధించింది.

పదే పదే అదే తప్పు చేస్తే..
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ గత మార్గదర్శకాల ప్రకారం, తొలిసారి ఓవర్‌ రేటు నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు జట్టు సారథికి రూ. 12 లక్షలు, అదే తప్పు మరోసారి చేస్తే రూ. 24 లక్షలు, తుదిజట్టులోని ప్రతీ ఆటగాడి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత పెడతారు. మూడోసారి కూడా అదే జరిగినట్లయితే, కెప్టెన్‌కు రూ. 30 లక్షల జరిమానాతో పాటు, ఒక మ్యాచ్‌లో నిషేధం, తుదిజట్టులోని ప్రతీ ఆటగాడికి రూ. 12 లక్షల జరిమానా, లేదంటే మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు.

చదవండి: World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్‌.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది!
IPL 2022 MI Vs DC: అనామక బ్యాటర్స్‌తో అసాధ్యమే! మ్యాచ్‌ చేజారిందని అనుకున్నాం.. కానీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement