Jos Buttler: 'నాకు అన్నీ తెలుసు.. అంపైర్‌తో పని లేదు'

IPL 2022: Jos Buttler Gains Review Success After Umpire Given Out Vs RCB - Sakshi

ఐపీఎల్‌ 2022లో భాగంగా ఆర్‌సీబీ, రాజస్తాన్‌ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ హర్షల్‌ పటేల్‌ వేశాడు. ఆ ఓవర్‌ నాలుగో బంతిని హర్షల్‌ పటేల్‌ అద్బుతంగా వేశాడు. స్లో యార్కర్‌గా వచ్చిన ఆ బంతి బట్లర్‌ ప్యాడ్లను తాకింది. ఆర్‌సీబీ ఆటగాళ్లు అప్పీల్‌ చేయగానే అంపైర్‌ ఔటిచ్చాడు. కానీ బట్లర్‌ క్రీజు నుంచి ఇంచు కూడా కదల్లేదు. ఎందుకంటే అది ఔట్‌ కాదని బట్లర్‌కు ముందే తెలుసు.

వాస్తవానికి బంతి బట్లర్‌ ప్యాడ్లను తాకడానికి ముందే బ్యాట్‌ను తాకింది. కానీ అంపైర్‌ అది గమనించకుండానే ఔట్‌ ఇచ్చాడు. బట్లర్‌ రివ్యూకు వెళ్లగా.. అల్ట్రాఎడ్జ్‌లో బంతి ప్యాడ్లను తాకడానికి ముందు బ్యాట్‌ను తాకినట్లు తేలింది. దీంతో అంపైర్‌ తన తప్పు తెలుసుకొని బట్లర్‌ నాటౌట్‌ అని ప్రకటించాడు. ఇది చూసిన అభిమానులు.. బట్లర్‌, అంపైర్‌ మధ్య మీమ్స్‌ క్రియేట్‌ చేశారు. నాకు అన్ని తెలుసు.. అంపైర్‌తో పని లేదు.. బట్లర్‌ కాన్ఫిడెంట్‌కు ఫిదా.. ఔట్‌ అని ప్రకటించినా క్రీజు నుంచి ఇంచు కూడా కదల్లేదు.. అంటూ కామెంట్స్‌ చేశారు.

37 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బట్లర్‌ ఆ తర్వాత ఆర్‌సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో బట్లర్‌ వరుస సిక్సర్లు సంధించాడు. అలా 47 బంతుల్లోనే 6 సిక్సర్లతో 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హెట్‌మైర్‌, బట్లర్‌ కలిసి చివరి రెండు ఓవర్లలో 42 పరుగులు పిండుకోవడంతో 18వ ఓవర్‌ వరకు 127/3గా ఉన్న స్కోరు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 169/3గా మారింది.

చదవండి: IPL 2022 RR Vs RCB: కోహ్లి స్టన్నింగ్‌ క్యాచ్‌.. వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top