GT Vs RR: 2012, 2014లో కేకేఆర్‌.. ఇప్పుడు గుజరాత్‌.. అరుదైన రికార్డు.. కాబట్టి!

IPL 2022 GT Vs RR: Highest Target Chased in Playoffs Or Knockouts GT Record - Sakshi

IPL 2022 GT Vs RR: క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది గుజరాత్‌ టైటాన్స్‌. ఐపీఎల్‌-2022లో పద్నాలుగింట 10 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. అంతేగాకుండా ఫైనల్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించి దర్జాగా తుదిమెట్టుపై అడుగుపెట్టింది.

కాగా సంజూ శాంసన్‌ బృందంతో మంగళవారం(మే 24)నాటి మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా సేన 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 

ఇక భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 19.3 ఓవర్లలోనే గుజరాత్‌ ఆ పని పూర్తి చేసింది. ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో డేవిడ్‌ మిల్లర్‌ సిక్స్‌ కొట్టడంతో టైటాన్స్‌ విజయం ఖరారైంది. ఈ సీజన్‌లో ఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది.

ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యా బృందం ఓ అరుదైన రికార్డు నమోదు చేసింది. ప్లే ఆఫ్స్‌/నాకౌట్‌ దశలో భారీ టార్గెట్‌ను ఛేదించిన మూడో జట్టుగా ఘనత సాధించింది. 2012లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌పై 191 పరుగులు, 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పంజాబ్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో 200 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. 

ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ లేదా నాకౌట్‌ దశలో భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్లు
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- 2012- చెన్నైలో సీఎస్‌కేపై- టార్గెట్‌-191
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- 2014- బెంగళూరులో పంజాబ్‌ కింగ్స్‌పై- టార్గెట్‌-200
గుజరాత్‌ టైటాన్స్‌- 2022- కోల్‌కతాలో రాజస్తాన్‌ రాయల్స్‌పై-టార్గెట్‌- 189

కాగా ఈ రెండు మ్యాచ్‌లలోనూ కేకేఆర్‌ విజేతగా నిలిచి ఆయా సీజన్లకు గానూ టైటిల్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక అత్యధిక పరుగుల ఛేజింగ్‌ రికార్డులో కేకేఆర్‌ సరసన గుజరాత్‌ నిలవడంతో ఫైనల్లోనూ గెలుపు వారినే వరిస్తుందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి👉🏾Hardik Pandya: దీనంతటికీ కారణం వాళ్లే.. ఉప్పొంగిపోను! అతడిని చూసి గర్వపడుతున్నా!
చదవండి👉🏾IPL 2022: ఐపీఎల్‌లో సంజు శాంసన్‌ చెత్త రికార్డు.. తొలి కెప్టెన్‌గా..!

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top