IPL 2022 DC Vs PBKS: ఢిల్లీ, పంజాబ్‌ మధ్య బిగ్‌ ఫైట్‌.. తుది జట్లు ఎలా ఉండబోతున్నాయంటే..!

IPL 2022: DC VS PBKS Predicted XI - Sakshi

DC VS PBKS Predicted Playing XI: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ (మే 16) మరో బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా ఢిల్లీ, పంజాబ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. నిన్న (మే 15) రాజస్థాన్‌ చేతిలో లక్నో ఓడిపోవడంతో.. ప్లేఆఫ్స్ ఈక్వేషన్స్ రసవత్తరంగా మారాయి. గుజరాత్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకోగా మిగిలిన మూడు స్దానాల కోసం ఆరు జట్ల (రాజస్థాన్‌, లక్నో, ఆర్సీబీ, ఢిల్లీ, కేకేఆర్‌, పంజాబ్‌) మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. 

ఇక నేటి మ్యాచ్‌ విషయానికొస్తే.. పంజాబ్‌, ఢిల్లీ జట్లు ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో చెరి 12 పాయింట్లు (12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) సాధించి పాయింట్ల పట్టికలో సమంగా ఉన్నాయి. అయితే పంజాబ్‌ (0.023)తో పోలిస్తే.. ఢిల్లీ (0.210) నెట్‌ రన్‌రేట్‌ కాస్త మెరుగ్గా ఉండటంతో ఆ జట్టు ఐదో స్థానంలో, పంజాబ్‌ ఏడో స్థానంలో ఉన్నాయి. ప్లే ​ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువ అవుతుంది.

తుది జట్లు ఎలా ఉండబోతున్నాయంటే.. 
గత కొద్ది రోజులుగా టైఫాయిడ్‌తో బాధపడ్డ ఢిల్లీ డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. అతను ఈ మ్యాచ్‌లో ఆడటం ఖాయంగా తెలుస్తోంది. ఇదే జరిగితే కేఎస్ భరత్‌పై వేటు పడే అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పు మినహా గత మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గెలిచిన జట్టునే డీసీ యధాతథంగా కొనసాగించవచ్చు. పంజాబ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌ కోసం మయాంక్‌ సేన ఎటువంటి మార్పులు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. గత మ్యాచ్‌లో ఆర్సీబీపై గెలిచిన జట్టునే యధాతథంగా కొనసాగించే ఛాన్స్‌ ఉంది. 

ప్రస్తుత ఫామ్‌ ప్రకారం చూస్తే.. నేటి మ్యాచ్‌లో రెండు జట్లకు సమానమైన విజయావకాశాలు ఉన్నాయి. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన బెయిర్‌ స్టో, లివింగ్‌స్టోన్‌ భీకరమైన ఫామ్‌లో ఉండగా.. బౌలర్లలో రబాడ, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్‌, రిషి ధవన్‌లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఢిల్లీ విషయానికొస్తే.. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మిచెల్‌ మార్ష్‌, డేవిడ్‌ వార్నర్‌లు రెచ్చిపోయి ఆడారు. వీరిద్దరు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే పంజాబ్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక పృథ్వీ షా, రిషబ్‌ పంత్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్‌ కూడా రాణిస్తే.. ఢిల్లీని ఆపడం చాలా కష్టమవుతుంది. 

తుది జట్లు (అంచనా)..
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్, జానీ బెయిర్‌స్టో, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రిషి ధవన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసొ రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్. 

ఢిల్లీ: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్‌ పంత్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా.
చదవండి: లక్నోకు షాకిచ్చిన రాజస్తాన్‌.. ప్లే ఆఫ్స్‌ దిశగా అడుగు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

16-05-2022
May 16, 2022, 06:07 IST
ముంబై: లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 24 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌కు...
15-05-2022
May 15, 2022, 21:17 IST
ఐపీఎల్‌లో శ్రీలంక యువ పేసర్‌ మతీషా పతిరనా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా ఆదివారం...
15-05-2022
15-05-2022
May 15, 2022, 18:42 IST
చెన్నై సూపర్‌ కింగ్స్‌ యువ పేసర్లు ముఖేష్‌ చౌదరి, సిమర్‌జీత్ సింగ్‌ త్వరలోనే భారత జట్టులోకి వస్తారని టీమిండియా మాజీ...
15-05-2022
May 15, 2022, 17:08 IST
ఐపీఎల్‌-2022లో వాంఖడే వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతోంది. కాగా ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా...
15-05-2022
May 15, 2022, 16:21 IST
రాజస్థాన్ రాయల్స్ పేసర్‌ నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ గాయం కారణంగా ఐపీఎల్‌-2022 నంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజగా అతడి...
15-05-2022
15-05-2022
May 15, 2022, 05:16 IST
పుణే: సీజన్‌ తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి...ఆ తర్వాత కోలుకొని చక్కటి ప్రదర్శనతో వరుసగా ఐదు విజయాలు...ఇక ప్లే ఆఫ్స్‌...
14-05-2022
May 14, 2022, 22:21 IST
ఐపీఎల్‌‌-2022లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌...
14-05-2022
May 14, 2022, 20:17 IST
పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌పై భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన జట్టు...
14-05-2022
14-05-2022
May 14, 2022, 18:03 IST
ఐపీఎల్‌‌-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు దినేష్‌ కార్తీక్‌ బెస్ట్‌ ఫినిషర్‌గా మారగా..  పంజాబ్ కింగ్స్‌కు లియామ్ లివింగ్‌స్టోన్ అత్యత్తుమ ఫినిషర్‌గాఘున్నాడు....
14-05-2022
May 14, 2022, 17:30 IST
ముంబై ఇండియన్స్‌ ఆటగాడు, హైదరాబాదీ యంగ్‌ క్రికెటర్‌ తిలక​ వర్మ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2022 సీజన్‌లో సూపర్‌...
14-05-2022
May 14, 2022, 16:37 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూ్స్‌ అందింది. జ్వరంతో గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన...
14-05-2022
May 14, 2022, 16:15 IST
Ambati Rayudu Deletes Retirment Tweet: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు.. రిటైర్మెంట్‌ (ఐపీఎల్‌) విషయంలో...
14-05-2022
May 14, 2022, 13:36 IST
Ambati Rayudu Retires From IPL: ఐపీఎల్‌ 2022 సీజన్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌కు అస్సలు కలిసి...
14-05-2022
May 14, 2022, 13:05 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్‌ రజత్‌ పాటిధార్‌ కొట్టిన సిక్స్‌ ముసలాయన తల పగిలేలా చేసింది. శుక్రవారం పంజాబ్‌...
14-05-2022
May 14, 2022, 12:56 IST
చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా ధోనికి ఈ సీజన్‌ (2022) ఆఖరుది కావచ్చు. ఈ నేపథ్యంలో ఆ జట్టు భవిష్యత్తు...
14-05-2022
May 14, 2022, 12:07 IST
ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ (2022)లో మునుపెన్నడూ లేని విధంగా పరుగుల కోసం పరితపించిపోతున్న విరాట్‌ కోహ్లి.. నిన్న (మే 13)...
14-05-2022
May 14, 2022, 11:15 IST
అనకాపల్లి: అతనొక చిరు వ్యాపారి. ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ నడుపుతూ స్వయం ఉపాధి పొందుతున్న మధ్య తరగతికి చెందిన వ్యక్తి. చిన్నప్పుడు... 

Read also in:
Back to Top