ఆ జట్టు ఎంత బాగా బ్యాటింగ్‌ చేసిందో చూశారుగా: రోహిత్‌

IPL 2021: You Saw How Punjab Kings Batted, Rohit Sharma - Sakshi

చెన్నై:  పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓడిపోవడం పట్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాము చేసిన స్కోరు చాలా స్వల్పమని, ఈ పరుగుల్ని కాపాడుకోవడం చాలా కష్లమన్నాడు. తమ బ్యాటింగ్‌లో మళ్లీ పొరపాటు జరిగిందని అందుకు  ఇలా విఫలమయ్యామన్నాడు. మ్యాచ్‌  తర్వాత అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్‌..  ‘ ఇదేమీ బ్యాడ్‌ వికెట్‌ కాదు.  బ్యాటింగ్‌  చేసేందుకు అనుకూలంగా ఉన్న వికెట్‌ అని నేను ఇప్పటికీ నమ్ముతున్నా. మా బ్యాటింగ్‌ బాలేదంతే. పంజాబ్‌ కింగ్స్‌ ఎంత ఈజీగా బ్యాటింగ్‌ చేసిందో మీరు చూశారుగా. 

పంజాబ్‌ 9 వికెట్ల తేడాతో గెలిచిందంటే  బ్యాటింగ్‌కు అనుకూలించనట్లే. మేము ఏమైనా 150-160 పరుగులు చేస్తే గేమ్‌లో ఉండేవాళ్లం.  గత రెండు మ్యాచ్‌ల్లో మేము బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాం. దీనిపై నిజాయితీగా పరిశీలన చేయాల్సి ఉంది. మా బౌలర్లు పవర్‌ ప్లేలో బాగా బౌలింగ్‌ చేశారు. మేము బ్యాటింగ్‌ చేసే క్రమంలో ఇషాన్‌ హిట్టింగ్‌ చేసే యత్నం చేశాడు.. కానీ సఫలం కాలేదు. నేను హిట్టింగ్‌ చేయడానికి సిద్దపడలేదు. మా బ్యాటింగ్‌లో ఏదో మిస్స​య్యింది. మా పవర్‌ ప్లే బాగున్నా, ఓవరాల్‌గా బాలేదు. ఈ తరహా చాలెంజ్‌ పిచ్‌ల్లో మనం ఎలా ఆడగలిగితే సక్సెస్‌ అవుతామో చూడాలి. ఆ ప్రయత్నం చేయాలి. అది వర్కౌట్‌ అయితే మంచిగా ఉంటుంది. ఒకవేళ విఫలం అయితే చెడు ఫలితం వస్తుంది’ అని తెలిపాడు. 

డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 132 పరగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్‌ రాహుల్‌ బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీకి(52 బంతుల్లో 60 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), గేల్‌ (35 బంతుల్లో 43 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్‌ తోడవ్వడంతో పంజాబ్‌ 9 వికెట్ల తేడాతో ముంబైపై ఘనవిజయం సాధించింది. పంజాబ్‌ కోల్పోయిన ఒకే ఒక వికెట్‌ ముంబై బౌలర్‌ రాహుల్‌ చాహర్‌కు లభించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top