కేకేఆర్‌.. 13 ఏళ్లు అయిపోయింది..ఈసారైనా?

IPL 2021: Will KKR Break 13 Years Record - Sakshi

కేకేఆర్‌.. ఇప్పటికే రెండు ఐపీఎల్‌ టైటిల్స్‌  సాధించి మూడోసారి రేసులో నిలిచింది ఈ జట్టు. తాజా ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌ అనూహ్యంగా ఫైనల్‌కు చేరింది. అసలు ప్లే ఆఫ్‌కు వస్తుందా అనే దశ నుంచి ఏకంగా తుదిపోరుకు అర్హత  సాధించింది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్సీబీని ఓడించిన కేకేఆర్‌.. క్వాలిఫయర్‌-2లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసింది. దాంతో చెన్నై సూపర్‌కింగ్స్‌తో అమీతుమీకి సిద్ధమైంది.  ఫలితంగా 2012, 2014 సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు.. ఇప్పుడు మరొ టైటిల్‌పై కన్నేసింది.  ప్రస్తుత ఐపీఎల్‌ ఒక్క మ్యాచ్‌తో ముగియనున్న నేపథ్యంలో కేకేఆర్‌ టైటిల్‌తో పాటు మరో రికార్డును బ్రేక్‌ చేయాలనే భావనలో ఉంది. 

13 ఏళ్లుగా నో ‘సెంచరీ’
ఐపీఎల్‌ ఆరంభపు సీజన్‌లో భాగంగా ఆటగాళ్ల వ్యక్తిగత విభాగంలో తొలి సెంచరీ సాధించిన జట్గుగా రికార్డు నమోదు చేసిన కేకేఆర్‌.. ఆపై ఇప్పటివరకూ మరో సెంచరీ సాధించిన చరిత్ర లేదు. మెకల్లమ్‌ 73 బంతుల్లో 158 పరుగులు సాధించిన తర్వాత ఆ జట్టులో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌. 2019లో రాజస్థాన్‌ రాయల్స్‌ దినేశ్‌ కార్తీక్‌ అజేయంగా 97 పరుగులు సాధించినప్పటికీ సెంచరీ చేయలేకపోయాడు. దాంతో మరో సెంచరీ సాధించే రికార్డు రెండేళ్ల కిందటే చేజారిపోయింది. మరి ఈ సీజన్‌లో కేకేఆర్‌ జట్టు నుంచి మరొక ప్లేయర్‌ శతకం సాధిస్తాడని భావించినా ఇప్పటివరకూ అది జరగలేదు. చదవండి: IPL Final CSK Vs KKR: ఎవరిదో ‘విజయ’ దశమి..?

కేకేఆర్‌ టీమ్‌(ఫైల్‌ఫోటో)

ఈ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు నుంచి ఎవరైనా శతకం నమోదు చేసి 13 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేస్తుందా అనేది చూడాలి. కేకేఆర్‌ జట్టు నుంచి అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన వారిలో మెకల్లమ్‌, దినేశ్‌ కార్తీక్‌ల తర్వాత స్థానంలో మనీష్‌ పాండే(94-2014లో పంజాబ్‌ కింగ్స్‌పై),క్రిస్‌ లిన్‌(93 నాటౌట్‌-2017లో గుజరాత్‌ లయన్స్‌పై), గౌతం గంభీర్‌(93- 2012లొ ఆర్సీబీపై)లు వరుసగా ఉన్నారు. 

మెకల్లమ్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌

మెకల్లమ్‌(ఫైల్‌ఫోటో)

కోల్‌కతా నైట్‌రైడర్స్‌-ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన మొదటి సీజన్‌(2008) తొలి మ్యాచ్‌లో ఒక జట్టు అంచనాలు మించి ఆడితే మరొక జట్టు పూర్తిగా తేలిపోయింది. ఇందులో అంచనాలు మించి ఆడిన జట్టు కేకేఆర్‌ కాగా, ఆర్సీబీ పూర్తిగా తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ.. ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. దాంతో కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను సౌరభ్‌ గంగూలీ, బ్రెండన్‌ మెకల్లమ్‌లు ధాటిగా ప్రారంభించారు. ప్రధానంగా మెకల్లమ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆర్సీబీ బౌలర్లకు ఆదిలోనే చుక్కలు కనబడ్డాయి. 5.2 ఓవర్లలో కేకేఆర్‌ 61 పరుగులు చేసిన తర్వాత గంగూలీ(10) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కానీ మెకల్లమ్‌ బ్యాటింగ్‌ మోత మాత్రం తగ్గలేదు.  స్టేడియం నలువైపులా షాట్లు కొడుతూ ఐపీఎల్‌కు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చాడు. పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌లో పరుగుల రుచి ఎలా ఉంటుందో మెకల్లమ్‌ చూపించడాంటే అతిశయోక్తి కాదేమో. 

ఒకవైపు కేకేఆర్‌ స్టార్‌ ఆటగాళ్లు  రికీ పాంటింగ్‌(20), డేవిడ్‌ హస్సీ(12)లు  విఫలమైనా మెకల్లమ్‌ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.  ఈ క్రమంలోనే భారీ సెంచరీ నమోదు చేశాడు. 73 బంతుల్లో 13 సిక్స్‌లు, 10 ఫోర్లతో అజేయంగా 158 పరుగులు చేసి కేకేఆర్‌ 222 భారీ పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇది ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో సెంచరీ కావడమే కాకుండా ఈ రికార్డు ఐదేళ్లు పాటు పదిలంగా ఉండటం విశేషం.  ఆటగాళ్ల అత్యధిక పరుగుల రికార్డులో మెకల్లమ్‌ నమోదు చేసిన 158 పరుగులు ఇప్పటికీ రెండో స్థానంలో ఉంది. 
చదవండి: హెలికాప్టర్‌ షాట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ధోని.. వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top