అక్కడ అదే చివరిసారి సంతోషం: ధోని

We Were Not Happy With The Wicket.Of Chennai After 2911, Dhoni - Sakshi

ముంబై: పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్పై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించడంతో​ ఆ జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని సంతోషంగా ఉన్నాడు. ముంబైలో తాము ఆడిన ప్రస్తుత వికెట్‌ చాలా బాగుందని పేర్కొన్న ధోని.. సీమ్, బౌన్స్‌, రన్స్‌ పరంగా మెరుగ్గా అనిపించిందన్నాడు. అసలు డ్యూ లేదని, దాంతో బంతి సీమ్‌ అయ్యిందన్నాడు. కానీ బంతి మాత్రం పెద్దగా స్వింగ్‌ కాలేదని ధోని తెలిపాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన ధోని.. తన సుదీర్ఘ ఐపీఎల్‌ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాన్నన్నాడు.  ఇది ధోనికి 200 ఐపీఎల్‌ మ్యాచ్‌ కావడంపై ధోని ఇలా సమాధానం చెప్పాడు. ‘నాది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. భిన్న పరిస్థితులు, వేర్వేరు దేశాల్లో ఆడాను. ఇది చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. పాత అనుభూతుల్ని గుర్తుకు తెస్తుంది(నవ్వుతూ).  నా ఐపీఎల్‌ జర్నీతో ఆనందంగా ఉన్నా’ అని తెలిపాడు.

ఇక చెన్నైలో చెపాక్‌ స్టేడియంలో వికెట్‌ గురించి ధోని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘గతంలో చెన్నై వికెట్‌ చాలా బాగుండేది. నాకు తెలిసి 2011లో చెన్నై వికెట్‌ చాలా బాగుంది. ఆ తర్వాత ఆ వికెట్‌తో మేము హ్యాపీగా లేము. దాన్ని పూర్వపు స్థితికి తీసుకురావడానికి చాలా గట్టిగా ప్రయత్నించారు. అయినా ఆ వికెట్‌లో ఎటువంటి మార్పులేదు. ఆ వికెట్‌పై బ్యాట్‌పై బంతికి సరిగా రాదు. అక్కడ భారీ షాట్లు ఆడాలంటే చాలా కష్టం’ అని తెలిపాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌ అద్భుతంగా బౌలింగ్‌ వేయడాన్ని కొనియాడాడు. చాహర్‌ డెత్‌ ఓవర్ల బౌలర్‌గా చాలా మెరగయ్యాడు.

‘‘నేను అతని చేతికి బంతి ఇచ్చిన ప్రతీసారి అందుకు న్యాయం చేస్తాడు. నేను అనుకున్న దాని కంటే పిచ్‌ను అర్థం చేసుకుని మరీ బౌలింగ్‌ చేస్తాడు. నేను ఎటాకింగ్‌ కోసం చూశాను కాబట్టి అతని చేత వరుసగా నాలుగు ఓవర్లు వేయించాను. మాకు ఉన్న బౌలింగ్‌ వనరులు కారణంగా చాహర్‌ చేత వరుసగా నాలుగు ఓవర్లు వేయించాను. ఇలా వరుసగా నాలుగు ఓవర్లు వేయించాలన్నా కూడా అతను ఫిట్‌గా ఉండాలి. అలా బౌలింగ్‌ చేయించడంతో చాహర్‌ మరింత ఫిట్‌ అవుతాడు. మేము మొయిన్‌ అలీ బ్యాట్‌ నుంచి భారీగానే ఆశిస్తున్నాము. ఆలీ ఆరంభంలో మెరుగ్గా ఆడితే మాకున్న మిగతా బ్యాటింగ్‌ వనరులను బాగా సద్వినియోగం చేసుకోగలము’ అని ధోని తెలిపాడు.

ఇక్కడ చదవండి: 
ఆ నాలుగే విషయాలు కోహ్లీకి చెప్పా: ఏబీ

క్యాచ్‌ పట్టినప్పుడల్లా తొడగొట్టావు.. మ్యాచ్‌ తర్వాత నీ పరిస్థితి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top