సామ్సన్‌.. అక్కడ ఉంది బాస్‌ ధోని !

IPL 2021: Fans In Awe As MS Dhoni Dives To Survive Run Out - Sakshi

ముంబై: రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ముందుగా బ్యాటింగ్‌ చేసి 189 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఓపెనర్‌ రుతరాజ్‌ గైక్వాడ్‌ (10) నిరాశపరచగా, డుప్లెసిస్ ‌(33; 17 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. మొయిన్‌ అలీ (26),  రైనా (18), రాయుడు (27), ఎంఎస్‌ ధోని (18), సామ్‌ కరాన్ ‌(13), డ్వేన్‌ బ్రేవో (20 నాటౌట్‌) తలో చేయి వేయడంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.  

సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో 
ఈ మ్యాచ్‌లో ఏడో స్థానంలో వచ్చిన సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఆరంభంలోనే రనౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 14 ఓవర్‌ చివరి బంతికి క్రీజ్‌లోకి వచ్చిన ధోని..  15 ఓవర్‌ రెండో బంతికి రనౌట్‌ అయ్యే అవకాశాన్ని తృటిలో తప్పించుకున్నాడు.  రాహుల్‌ తెవాతియా వేసిన బంతిని కవర్స్‌లోకి ఫ్లిక్‌ చేసి సింగిల్‌కి యత్నించాడు.

అయితే జడేజా సింగిల్‌ వద్దని గట్టిగా అరిచాడు. అ‍ప్పటికే క్రీజ్‌ను వదిలి చాలా దూరం ముందుకు వచ్చేసిన ధోని.. జడేజా కాల్‌తో వెనక్కి మళ్లాడు. అంతేవేగంగా కవర్స్‌లో ఉన్న ఫీల్డర్‌.. కీపర్‌  సామ్సన్‌కు మెరుపువేగంతో బంతిని అందించాడు. అంతే ఒక్క ఉదుటన డైవ్‌ కొట్టిన ధోని కొద్దిపాటిలో రనౌట్‌ నుంచి తప్పించుకున్నాడు. ఇలా ధోని డైవ్‌ కొట్టి బ్యాట్‌ను క్రీజ్‌లో పెట్టడంతో దటీజ్‌ బాస్‌ అంటూ సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కీపర్‌ టూ కీపర్‌ పోరులోనైనా, కీపర్‌ టూ బ్యాట్స్‌మన్‌ పోరులో నైనా ధోనినే బెస్ట్‌ కదా అని కొనియాడుతున్నారు. సామ్సన్‌.. అక్కడ ఉంది మీ అందరికీ బాస్‌ ధోని అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top