క్రికెటర్లకేంటీ దుస్థితి.. ఒకరేమో కార్పెంటర్‌గా మరొకరేమో క్యాబ్‌ డ్రైవర్‌గా

International Level Cricketers Faces Financial Struggles After Retirement - Sakshi

న్యూఢిల్లీ: క్రీడల చరిత్రలో ఫుట్‌బాల్‌ తర్వాత అత్యధికంగా కాసుల కురిపించే ఆటగా చలామణి అవుతున్న క్రికెట్‌లో కొందరు మాజీలు ఆర్ధిక కష్టాల కారణంగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. కొద్ది రోజుల కిందట ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేవియర్ డోహర్టీ కార్పెంటర్‌గా పని చేసుకుంటున్న విషయం వెలుగు చూడగా, తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అర్షద్ ఖాన్ దయనీయ స్థితి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. 

2015 వన్డే ప్రపంచ కప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్న డోహర్టీ ఆర్థిక కష్టాల కారణంగా కార్పెంటర్‌ అవతారమెత్తాడు. లెఫ్టార్మ్ స్పిన్నరయిన డోహర్టీ.. ఆస్ట్రేలియా తరఫున 60 వన్డేలు, నాలుగు టెస్ట్‌లు ఆడి 55 వికెట్లు తీశాడు. 2001-02 సీజన్‌లో ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆయన.. 17 ఏళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగాడు. అతను చివరి సారిగా గతేడాది భారత్ వేదికగా జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్నాడు.

ఇక ఆర్ధిక ఇబ్బందులు తాలలేక క్యాబ్ డ్రైవర్‌గా మారిన అర్షద్‌ ఖాన్‌ది కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో భారీ నేపథ్యమే. పాకిస్థాన్ తరఫున 1997-98లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఈ రైట్‌ ఆర్మ్‌ ఆఫ్ స్పిన్ బౌలర్‌.. 2006 వరకు 9 టెస్ట్‌లు, 85 వన్డేలు ఆడాడు. భారత్‌ 2005 పాక్ పర్యటనలో అదరగొట్టిన అర్షద్‌.. దిగ్గజ ఆటగాళ్లైన సెహ్వాగ్, సచిన్ వికెట్లను తీసి, అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్‌గా ఓ వెలుగు వెలిగాడు.

అయితే, రిటైర్మెంట్ అనంతరం గడ్డు పరిస్థితులు ఎదురవ్వడంతో క్యాబ్‌ డ్రైవర్‌గా మారాడు. కుటుంబాన్ని పోషించేందుకు సిడ్నీలో నానా తంటాలు పడుతున్నాడు. ఇక అర్షద్‌ తన చివరి టెస్ట్, వన్డేను భారత్‌లోనే ఆడాడు. మొత్తంగా ఆర్ధిక కష్టాల కారణంగా దయనీయ పరిస్థితులను ఎదుర్కొన్న అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ల జాబితా చాలా పెద్దగానే ఉంది. శ్రీలంక ఆటగాడు సూరజ్‌ రణ్‌దీవ్‌, న్యూజిలాండ్‌ ఆటగాళ్లు మాథ్యూ సింక్లెయిర్‌, క్రిస్‌ కెయిన్స్‌, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఆడమ్‌ హోలియోక్‌, ఆసీస్‌ స్పీడ్‌ స్టార్‌ క్రెయిగ్‌ మెక్‌ డెర్మాట్‌.. ఇలా ప్రస్తుత, పాత తరానికి చెందిన ఆటగాళ్ల జాబితా చాంతాడంత ఉంది.
చదవండి: టీమిండియానే ప్రపంచ ఛాంపియన్‌.. ఆసీస్‌ కెప్టెన్‌ జోస్యం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top