టీ20 వరల్డ్‌కప్‌ 2024.. భారత జట్టు ప్రకటనకు ముహూర్తం ఖరారు | Indian Squad For T20I World Cup To Be Announced On May 2024, Says Reports | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌ 2024.. భారత జట్టు ప్రకటనకు ముహూర్తం ఖరారు

Mar 1 2024 3:09 PM | Updated on Mar 2 2024 8:32 AM

Indian Squad For T20I World Cup To Be Announced On May 2024 Says Reports - Sakshi

ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌కప్‌ కోసం భారత క్రికెట్‌ జట్టును మే 1న ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఐపీఎల్‌ ప్రదర్శనల ఆధారంగా జట్టు ఎంపిక ఉంటుందని సమాచారం. ఈ జట్టుకు రోహిత్‌ శర్మ సారధిగా వ్యవహరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. హిట్‌మ్యాన్‌కు డిప్యూటీగా హార్దిక్‌ పాండ్యా పేరు దాదాపుగా ఖరారైంది.

సీనియర్లు విరాట్‌ కోహ్లి సహా మొహమ్మద్‌ షమీకి కూడా మెగా టోర్నీ సమయానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం కోహ్లి వ్యక్తిగత కారణాల చేత, షమీ గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నారు. ఈ యేడు వరల్డ్‌కప్‌కు యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 20 జట్లు వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నాయి.

టోర్నీ ఓపెనింగ్‌ మ్యాచ్‌లో ఆతిథ్య యూఎస్‌ఏ.. కెనడాతో తలపడుతుంది. జూన్‌ 5న భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జూన్‌ 9న న్యూయార్క్‌ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఇదిరకే ప్రకటించారు. వరల్డ్‌కప్‌లో ఆడబోయే భారత జట్టు సీనియర్లు, జూనియర్ల సమాహారంగా ఉండవచ్చు. 

గ్రూప్‌ దశలో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు..

  • జూన్‌ 5: భారత్‌​ వర్సెస్‌ ఐర్లాండ్‌ (న్యూయార్క్‌)
  • జూన్‌ 9: భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ (న్యూయార్క్‌)
  • జూన్‌ 12: భారత్‌ వర్సెస్‌ యూఎస్‌ఏ (న్యూయార్క్‌)
  • జూన్‌ 15: భారత్‌ వర్సెస్‌ కెనడా (ఫ్లోరిడా)  

గ్రూప్‌ దశలో జరుగబోయే మొత్తం మ్యాచ్‌ల వివరాలు..

  • జూన్‌ 1: యూఎస్‌ఏ వర్సెస్‌ కెనడా (డల్లాస్‌)
  • జూన్‌ 2: నమీబియా వర్సెస్‌ ఒమన్‌ (బార్బడోస్‌)
  • జూన్‌ 2: వెస్టిండీస్‌ వర్సెస్‌ పపువా న్యూ గినియా (గయానా)
  • జూన్‌ 3: శ్రీలంక వర్సెస్‌ సౌతాఫ్రికా (న్యూయార్క్‌)
  • జూన్‌ 3: ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ ఉగాండ (గయానా)
  • జూన్‌ 4: నెదర్లాండ్స్‌ వర్సెస్‌ నేపాల్‌ (డల్లాస్‌)
  • జూన్‌ 4: ఇంగ్లండ్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌ (బార్బడోస్‌)
  • జూన్‌ 5: భారత్‌​ వర్సెస్‌ ఐర్లాండ్‌ (న్యూయార్క్‌)
  • జూన్‌ 5: ఆస్ట్రేలియా వర్సెస్‌ ఒమన్‌ (బార్బడోస్‌)
  • జూన్‌ 5: పుపువా న్యూ గినియా వర్సెస్‌ ఉగాండ (గయానా)
  • జూన్‌ 6: యూఎస్‌ఏ వర్సెస్‌ పాకిస్తాన్‌ (డల్లాస్‌)
  • జూన్‌ 6: నమీబియా వర్సెస్‌ స్కాట్లాండ్‌ (బార్బడోస్‌)
  • జూన్‌ 7: శ్రీలంక వర్సెస్‌ బంగ్లాదేశ్‌ (డల్లాస్‌)
  • జూన్‌ 7: ఐర్లాండ్‌ వర్సెస్‌ కెనడా (న్యూయార్క్‌)
  • జూన్‌ 7: న్యూజిలాండ్‌ వర్సెస్‌ ఆప్ఘనిస్తాన్‌ (గయానా)
  • జూన్‌ 8: నెదర్లాండ్స్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (న్యూయార్క్‌)
  • జూన్‌ 8: ఆస్ట్రేలియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ (బార్బడోస్‌)
  • జూన్‌ 8: వెస్టిండీస్‌ వర్సెస్‌ ఉగాండ (గయానా)
  • జూన్‌ 9: భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ (న్యూయార్క్‌)
  • జూన్‌ 9: ఒమన్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌ (ఆంటిగ్వా)
  • జూన్‌ 10: సౌతాఫ్రికా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ (న్యూయార్క్‌)
  • జూన్‌ 11: శ్రీలంక​ వర్సెస్‌ నేపాల్‌ (లాడర్‌హిల్‌)
  • జూన్‌ 11: పాకిస్తాన్‌ వర్సెస్‌ కెనడా (న్యూయార్క్‌)
  • జూన్‌ 11: ఆస్ట్రేలియా వర్సెస్‌ నమీబియా (ఆంటిగ్వా)
  • జూన్‌ 12: వెస్టిండీస్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ (ట్రినిడాడ్‌)
  • జూన్‌ 12: భారత్‌ వర్సెస్‌ యూఎస్‌ఏ (న్యూయార్క్‌)
  • జూన్‌ 13: ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఒమన్‌ (ఆంటిగ్వా)
  • జూన్‌ 13: ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ పపువా న్యూ గినియా (ట్రినిడాడ్‌)
  • జూన్‌ 13: బంగ్లాదేశ్‌ వర్సెస్‌ నెదర్లాండ్స్‌ (సెయింట్‌ విన్సెంట్‌)
  • జూన్‌ 14: యూఎస్‌ఏ వర్సెస్‌ ఐర్లాండ్‌ (లాడర్‌హిల్‌)
  • జూన్‌ 14: న్యూజిలాండ్‌ వర్సెస్‌ ఉగాండ (ట్రినిడాడ్‌)
  • జూన్‌ 14: సౌతాఫ్రికా వర్సెస్‌ నేపాల్‌ (సెయింట్‌ విన్సెంట్‌)
  • జూన్‌ 15: భారత్‌ వర్సెస్‌ కెనడా (ఫ్లోరిడా)  
  • జూన్‌ 15: నమీబియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ (ఆంటిగ్వా)
  • జూన్‌ 15: ఆస్ట్రేలియా వర్సెస్‌ స్కాట్లాండ్‌ (సెయింట్‌ లూసియా)
  • జూన్‌ 16: పాకిస్తాన్‌ వర్సెస్‌ ఐర్లాండ్‌ (లాడర్‌హిల్‌)
  • జూన్‌ 16: శ్రీలంక వర్సెస్‌ నెదర్లాండ్స్‌ (సెయింట్‌ లూసియా)
  • జూన్‌ 16: బంగ్లాదేశ్‌ వర్సెస్‌ నేపాల్‌ (సెయింట్‌ విన్సెంట్‌)
  • జూన్‌ 17: న్యూజిలాండ్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ (ట్రినిడాడ్‌)
  • జూన్‌ 17: వెస్టిండీస్‌ వర్సెస్‌ ఆఫ్ఘనిస్తాన్‌ (సెయింట్‌ లూసియా)

సూపర్‌ 8 మ్యాచ్‌లు..

  • జూన్‌ 19: ఏ2 వర్సెస్‌ డి1 (ఆంటిగ్వా)
  • జూన్‌ 19: బి1 వర్సెస్‌ సి2 (సెయింట్‌ లూసియా)
  • జూన్‌ 20: బి2 వర్సెస్‌ డి2 (ఆంటిగ్వా)
  • జూన్‌ 20: ఏ1 వర్సెస్‌ సి1 (బార్బడోస్‌)
  • జూన్‌ 21: ఏ2 వర్సెస్‌ సి2 (బార్బడోస్‌)
  • జూన్‌ 21: బి1 వర్సెస్‌ డి1 (సెయింట్‌ లూసియా)
  • జూన్‌ 22: ఏ1 వర్సెస్‌ డి2 (ఆంటిగ్వా)
  • జూన్‌ 22: సి1 వర్సెస్‌ బి2 (సెయింట్‌ విన్సెంట్‌)
  • జూన్‌ 23: సి2 వర్సెస్‌ డి1 (ఆంటిగ్వా)
  • జూన్‌ 23: ఏ2 వర్సెస్‌ బి1 (బార్బడోస్‌)
  • జూన్‌ 24: బి2 వర్సెస్‌ ఏ1 (సెయింట్‌ లూసియా)
  • జూన్‌ 24: సి1 వర్సెస్‌ డి2 (సెయింట్‌ విన్సెంట్‌)
  • జూన్‌ 26: సెమీఫైనల్‌-1 (గయానా)

జూన్‌ 27: సెమీఫైనల్‌-2 (ట్రినిడాడ్‌)

జూన్‌ 29: ఫైనల్‌ (బార్బడోస్‌)

* సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డేస్‌ ఉన్నాయి. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement