IND Vs SA: క్లాసెన్‌ విధ్వంసం.. టీమిండియాకు రెండో టి20లోనూ పరాజయం

India Vs South Africa 2nd T20 Match Live Updates And Highligts - Sakshi

టీమిండియాకు వరుసగా రెండో పరాజయం
►టీమిండియాతో జరిగిన రెండో టి20లో సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (46 బంతుల్లో 81 పరుగులు, 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో సౌతాఫ్రికా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.  

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఆరంభం నుంచి ప్రొటిస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆఖర్లో దినేశ్‌ కార్తిక్‌ 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు బాదడంతో కనీసం ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. అంతకముందు శ్రేయాస్‌ అయ్యర్‌ 40, ఇషాన్‌ కిషన్‌ 34 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో నోర్ట్జే రెండు వికెట్లు తీయగా.. రబాడ, పార్నెల్‌, ప్రిటోరియస్‌, కేశవ్‌ మహరాజ్‌ తలా ఒక వికట్‌ తీశారు. 

బవుమా(35) ఔట్‌.. నాలుగో వికెట్‌ డౌన్‌
►సౌతాఫ్రికా కెప్టెన్‌ బవుమా(35) రూపంలో నాలుగో వికెట్‌ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న బవుమాను చహల్‌ తెలివైన బంతితో క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.

11 ఓవర్లలో సౌతాఫ్రికా 70/3
►11 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. కెప్టెన్‌ బవుమా 31, క్లాసెన్‌ 35 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.

డేంజరస్‌ డుసెన్‌ ఔట్‌.. సాతాఫ్రికా 30/3
►టీమిండియాతో రెండో టి20లో సౌతాఫ్రికా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. గత మ్యాచ్‌ హీరో డేంజరస్‌ డుసెన్‌ ఒక్క పరుగు మాత్రమే చేసి భువనేశ్వర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది.

ప్రిటోరియస్‌(4) ఔట్‌.. రెండో వికెట్‌ డౌన్‌
►డ్వేన్‌ ప్రిటోరియస్‌(4) రూపంలో సౌతాఫ్రికా రెండో వికెట్‌ కోల్పోయింది. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన ప్రిటోరియస్‌ ఆవేశ్‌ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది.

తొలి వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
►149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన హెండ్రిక్స్‌ భువనేశ్వర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం వికెట్‌ నష్టానికి 5 పరుగులు చేసింది.

విఫలమైన టీమిండియా బ్యాటర్లు.. సౌతాఫ్రికా టార్గెట్‌ 149
►సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టి20లో టీమిండియా నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఆరంభం నుంచి ప్రొటిస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆఖర్లో దినేశ్‌ కార్తిక్‌ 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు బాదడంతో కనీసం ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. అంతకముందు శ్రేయాస్‌ అయ్యర్‌ 40, ఇషాన్‌ కిషన్‌ 34 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో నోర్ట్జే రెండు వికెట్లు తీయగా.. రబాడ, పార్నెల్‌, ప్రిటోరియస్‌, కేశవ్‌ మహరాజ్‌ తలా ఒక వికెట్‌ తీశారు. 

17 ఓవర్లు.. ఆరో వికెట్‌ డౌన్‌
► 17 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. పది పరుగులు చేసిన అక్షర్‌ పటేల్‌ క్లీన్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం స్కోర్‌ 17 ఓవర్లకు 112/6 వికెట్లు కోల్పోయింది టీమిండియా.

15 ఓవర్లకు..
15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్‌ 103/5. దినేష్‌, అక్షర్‌ పటేల్‌ క్రీజులో ఉన్నారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
► శ్రేయస్‌ అయ్యర్‌ కీపర్‌ క్యాచ్‌. 35 బంతుల్లో 40 పరుగులు చేసి కీపర్‌ క్యాచ్‌ ద్వారా అవుట్‌. టీమిండియా స్కోర్‌ 13.5 ఓవర్లకు 98/5.

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
►12.4 వద్ద హార్దిక్‌ పాండ్యా అవుట్‌. టీమిండియా బ్యాట్స్‌మన్‌ హార్ధిక్‌ పాండ్యా 12 బంతుల్లో 9 పరుగులు చేసి క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్‌ పటేల్‌.

11 ఓవర్లకు.. 
► టీమిండియా 11 ఓవర్లకు 78 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. శ్రేయాస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్యా క్రీజులో ఉన్నారు.

రిషబ్‌ పంత్‌(5) ఔట్‌.. మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
►టీమిండియా స్టాండ్‌-ఇన్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ బ్యాటింగ్‌లో మరోసారి నిరాశపరిచాడు. 5 పరుగులు మాత్రమే చేసిన పంత్‌ కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో డుసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. 

ఇషాన్‌ కిషన్‌(34) ఔట్‌.. రెండో వికెట్‌ డౌన్‌
►దాటిగా ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌(21 బంతుల్లో 34, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) నోర్ట్జే బౌలింగ్‌లో డుసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం ఏడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.

6 ఓవర్లలో టీమిండియా 42/1
►6 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్‌ నష్టానికి 42 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ 29, శ్రేయాస్‌ అయ్యర్‌ 11 పరుగులతో ఆడుతున్నారు.

రుతురాజ్‌(1) ఔట్‌‌.. తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
►సౌతాఫ్రికాతో రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియాకు ఆదిలోనే గట్టిషాక్‌ తగిలింది. రబాడ బౌలింగ్‌లో రుతురాజ్‌​ గైక్వాడ్‌(1) కేశవ్‌ మహరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం  2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 11 పరుగులు చేసింది. 

ఆదివారం కటక్‌ వేదికగా రెండో టీ20లో దక్షిణాఫ్రికా, భారత్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలి టీ20లో ఓటమి చెందిన టీమిండియా బదులు తీర్చుకోవడానికి సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్‌ భావిస్తోంది. తొలి టి20లో బౌలింగ్‌ ఫెయిల్యూర్‌తో ఓటమి చవిచూసినప్పటికి టీమిండియా జట్టు ఎలాంటి మార్పులేకుండా బరిలోకి దిగుతుంది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం రెండు మార్పులతో ఆడుతుంది. డికాక్‌, స్టబ్స్‌ స్థానంలో క్లాసెన్‌, హెండ్రిక్స్‌ తుది జట్టులోకి వచ్చారు.

భారత్ తుదిజట్టు: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్

దక్షిణాఫ్రికా తుదిజట్టు: టెంబా బావుమా(కెప్టెన్‌), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌ కీపర్‌), డ్వైన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top