జనవరి 11, 2022.. ఆ రోజు కోహ్లికి చిరకాలం గుర్తుండిపోనుంది.. ఎందుకంటే..?

IND Vs SA: Virat Kohli To Celebrate Daughter First Birthday And 100th Test On Jan 11, 2022 - Sakshi

Virat Kohli To Celebrate Daughter First Birthday And 100th Test On Jan 11, 2022: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి వచ్చే ఏడాది(2022) జనవరి 11వ తేదీ ప్రత్యేకమైన రోజు కానుంది. ఆ రోజు కోహ్లి, అనుష్క దంపతుల గారాలపట్టి వామిక మొదటి జన్మదినం కావడంతో పాటు కెరీర్‌లో కోహ్లికి వందో టెస్ట్‌ కావడం విశేషం. క్రికెట్‌ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ చిరకాలం గుర్తుండిపోయే ఆ రోజు కోసం కోహ్లి సహా అతని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ 26న తొలి టెస్టు ఆడనున్న భారత్‌.. రెండో టెస్టు వచ్చే ఏడాది జనవరి 3న, సిరీస్‌లో ఆఖరుదైన మూడో టెస్ట్‌ జనవరి 11న ఆడాల్సి ఉంది. 

ఇప్పటివరకు కెరీర్‌లో 97 టెస్ట్‌లు ఆడిని ఈ రన్‌ మెషీన్‌.. మరో మూడు మ్యాచ్‌లు ఆడితే తన కెరీర్‌లో మరో అరుదైన మైలరాయిని చేరుకుంటాడు.విరాట్ తన టెస్ట్‌ కెరీర్‌లో 50.65 సగటుతో 7,801 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, కోవిడ్‌ ఒమిక్రాన్ వేరియంట్‌ నేపథ్యంలో వారం రోజుటు వాయిదా పడిన దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ వాయిదా పడగా.. టెస్ట్‌, వన్డే సిరీస్‌లు యధావిధిగా జరగనున్న సంగతి తెలిసిందే. మరోవైపు కోహ్లి తన ముద్దుల తనయ వామికకు సంబంధించిన ఫోటో కాని వీడియో కాని ఇప్పటివరకు బహిర్గతం చేయకపోవడంతో.. ఆ రోజు కోహ్లి ఖచ్చితంగా తన కూతురును ప్రపంచానికి పరిచయం చేస్తాడని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. 
చదవండి: అందుకే విరాట్‌ను ప్రపంచపు అత్యుత్తమ కెప్టెన్‌ అనేది‌: పాక్‌ మాజీ సారధి
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top