
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న తొలి వన్డేలో టీమిండియా 186 పరుగులకే ఆలౌటైంది. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 73 పరుగులు చేయడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా సాధించ గల్గింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్ ఐదు వికెట్లు, ఎబాదాత్ హోస్సేన్ నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ పతనాన్ని శాసించారు.
భారత బ్యాటర్లలో రాహుల్ మినహా మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. అనంతరం రోహిత్, కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
అయితే ఒకే ఓవర్‌లో రోహిత్, కోహ్లిని ఔట్ చేసి షకీబ్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కాస్త ఆచితూచి ఆడారు. ఇక అయ్యర్(24) ఔటైన తర్వాత భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇక అఖరి వరకు ఒంటరి పోరాటం చేసిన రాహుల్ 49 ఓవర్‌లో తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు.
చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. రిషబ్ పంత్ దూరం! బీసీసీఐ కావాలనే తప్పించిందా?