Virat Kohli: ఏంటిది కోహ్లి?! పాపం భరత్.. మరీ ఇంత కోపమా? అదొక్కటే కనిపించిందా? వైరల్

Virat Kohli Death Stare At KS Bharat Viral: కోన శ్రీకర్ భరత్.. ఈ ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ టెస్టుతో టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి అరంగేట్రం చేశాడు.
ఆడిన తొలి మ్యాచ్ నుంచే తన వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకున్నాడు భరత్. అయితే బ్యాటర్‌గా మాత్రం రాణించలేకపోయాడు. అరంగేట్ర టెస్టులో 8, ఢిల్లీ టెస్టులో వరుసగా 6, 23 నాటౌట్.. మూడో మ్యాచ్‌లో మొత్తంగా 20 పరుగులు మాత్రమే చేశాడు.
ఆరోస్థానంలో వచ్చి..
అయితే, నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో భరత్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. అహ్మదాబాద్ నాలుగో రోజు ఆటలో భాగంగా శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పితో దూరం కావడంతో ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు భరత్.
రవీంద్ర జడేజా అవుట్ కావడంతో క్రీజులో వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి 50 పరుగుల పైచిలుకు మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశాడు. 1993లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ తర్వాత ఐదో వికెట్‌కు ఈ మేర పార్ట్‌నర్‌షిప్ నమోదు కావడం విశేషం.
ఇదే అత్యధిక స్కోరు
ఈ క్రమంలో 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 136.4వ ఓవర్లో నాథన్ లియోన్ బౌలింగ్‌లో భరత్ హ్యాండ్స్‌కాంబ్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 88 బంతుల్లో రెండ ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 44 పరుగులు సాధించాడు. ఇక ఈ సిరీస్‌లో భరత్‌కు ఇదే అత్యధిక స్కోరు.
ఇదిలా ఉంటే... 109వ ఓవర్లో టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో కోహ్లి- భరత్ మధ్య సమన్వయం లోపించింది. పరుగు తీసేందుకు కోహ్లి కాల్ ఇవ్వగా.. నిరాకరించిన భరత్ మందకొడిగా కదిలాడు. అప్పటికే పిచ్ మధ్య వరకు వచ్చిన కోహ్లి వేగంగా వెనక్కి పరిగెత్తుకు వెళ్లాడు. కొద్దిలో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
భరత్‌పై సీరియస్ అయిన కోహ్లి
దీంతో కోహ్లి కోపం నషాలానికి అంటింది. భరత్‌ను సీరియస్‌గా చూస్తూ ఏదో తిట్టినట్లుగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘పాపం భరత్.. మరీ ఇలా ఎందుకు ట్రీట్ చేస్తున్నావు కోహ్లి.. మొన్న అలా.. ఇప్పుడిలా? నువ్వు కూడా సింగిల్ విషయంలో చూసుకోవాలి కదా! ప్రతిదానికి ఎదుటివాళ్లను బాధ్యుల్ని చేయడం సరికాదు’’ అని కామెంట్లు చేస్తున్నారు.
అది మాత్రం కనిపించలేదా?
కాగా సమయంలో 68 పరుగులతో ఉన్న కోహ్లి 155 పరుగులు పూర్తి చేసుకుని డబుల్ సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. మరికొందరేమో కోహ్లికి సపోర్టు చేస్తూ.. ‘‘కీలక సమయంలో ఇలాంటి తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే తను అలా స్పందించాడు. అందులో తప్పేముంది?’’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను హైలైట్ చేస్తున్నవాళ్లు.. ఆ తర్వాత మెరుగైన ఇన్నింగ్స్ ఆడిన భరత్‌ను కోహ్లి అభినందించిన దృశ్యాలు కూడా షేర్ చేయాలంటూ చురకలు అంటిస్తున్నారు.
చదవండి: WTC Final: టీమిండియాతో రేసులో దూసుకొస్తున్న లంక.. కివీస్ అద్భుతం చేస్తేనే..
Virat Kohli 75th Century: కింగ్ ఈజ్ బ్యాక్.. ఆ ఇద్దరు దిగ్గజాల తర్వాత కోహ్లికే సాధ్యమైంది!
WTC- Ind VS Aus 4th Test: టీమిండియాకు ఊహించని షాక్!
This is very shameful reaction from Virat Kohli towards youngster KS Bharat
Sad to see a youngster being Demotivated by someone's Ego💔pic.twitter.com/ygg3eDhcZl
— Immy|| 🇮🇳 (@TotallyImro45) March 12, 2023
Virat Kohli appreciating KS Bharat knock. pic.twitter.com/vbo4nrVe4F
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 12, 2023
Virat Kohli is on song here.
Back to back boundaries by him to get to his 150.#INDvAUS #TeamIndia @imVkohli pic.twitter.com/rEHsp7QvG8
— BCCI (@BCCI) March 12, 2023
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు