ఐసీసీ సీఈవోగా ఆసీస్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌... | ICC Appoints Geoff Allardice As Permanent CEO | Sakshi
Sakshi News home page

Geoff Allardice: ఐసీసీ సీఈవోగా ఆసీస్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌...

Nov 21 2021 4:22 PM | Updated on Nov 21 2021 4:33 PM

ICC Appoints Geoff Allardice As Permanent CEO - Sakshi

ICC Appoints Geoff Allardice As Permanent CEO: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సీఈవోగా  ఆస్ట్రేలియాకు చెందిన  జెఫ్ అలార్డైస్  నియమితులయ్యారు. ఎనిమిది నెలలకు పైగా తాత్కాలిక సీఈవోగా ఉన్న జెఫ్ అలార్డైస్‌ను శాశ్వత సీఈవోగా నియమిస్తున్నట్లు ఐసీసీ ఆదివారం ప్రకటించింది. ఆసీస్‌ మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆటగాడైన జెఫ్.. గతంలో ఐసీసీ జనరల్ మేనేజర్ గా కూడా పని చేశారు. ఐసీసీ సీఈవోగా జెఫ్ అలార్డైస్ భాధ్యతలు చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అని  ఐసీసీ చైర్మన్‌ గ్రెగ్ బార్క్లే తెలిపాడు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. "ఐసీసీ సీఈవోగా భాధ్యతలు స్వీకరించడానికి జెఫ్ అంగీకరించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇటీవలే ముగిసిన పురుషుల టీ20 ప్రపంచకప్ ను అద్భుతంగా నిర్వహించడంలో జెఫ్ కీలక మైన పాత్రపోషించాడు. అతడికి క్రికెట్‌పైన అపారమైన అనభవం ఉంది.  రాబోయే దశాబ్దంలో ఐసీసీ చాలా కీలకమైన టోర్నీలు నిర్హహిస్తుంది. ఈ క్రమంలో మా సభ్యులతో కలిసి  పనిచేయడానికి అతడే  సరైన వ్యక్తి అని  గ్రెగ్ బార్క్లే పేర్కొన్నాడు.

చదవండి:WI vs SL: తలకు బలంగా తగిలిన బంతి.. ఫీల్డ్‌లోనే కుప్పకూలాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement