మల్టీ టాలెంటెడ్.. పైలట్ అవతారమెత్తిన గ్లెన్‌ ఫిలిప్స్‌ | Glenn Phillips shows pilot skills, video goes viral | Sakshi
Sakshi News home page

#Glenn Phillips: మల్టీ టాలెంటెడ్.. పైలట్ అవతారమెత్తిన గ్లెన్‌ ఫిలిప్స్‌

Mar 18 2026 1:10 PM | Updated on Mar 18 2026 1:31 PM

Glenn Phillips shows pilot skills, video goes viral

న్యూజిలాండ్ స్టార్ ప్లేయ‌ర్ గ్లెన్ ఫిలిప్స్‌కు సాధ్య‌ప‌డ‌నిది అంటూ ఏదైనా ఉందా? అంటే లేదు అనే అన్పిస్తోంది. మైదానంలో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌, వికెట్ కీపింగ్‌ల‌తో సూపర్‌ మ్యాన్‌గా పేరొందిన ఫిలిప్స్‌.. ఇప్పుడు త‌నలోని పైలట్ స్కిల్స్‌ను బ‌య‌ట‌పెట్టాడు. ఫిలిప్స్ మంగ‌ళ‌వారం ఆక్లాండ్‌లోని ఆర్డ్‌మోర్ ఏరోడ్రోమ్‌లో మినీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా ల్యాండ్ చేశాడు. 

దీనికి సంబంధించిన వీడియోను ఫిలిప్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.  ఫిలిప్స్ ప్రస్తుతం కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఓవైపు క్రికెట్ కెరీర్‌ను కొన‌సాగిస్తూనే.. ఆర్డ్‌మోర్ ఫ్లయింగ్ స్కూల్‌లో పైలట్‌గా శిక్ష‌ణ పొందుతున్నాడు.

ప్ర‌స్తుతం స్వ‌దేశంలో సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌కు దూరంగా ఫిలిప్స్.. ఫ్లయింగ్ స్కూల్‌లో త‌న ఖాళీ స‌మ‌యాన్ని గ‌డ‌పుతున్నాడు. ఫిలిఫ్స్‌కు విమానాలు న‌డ‌ప‌డం అంటే చిన్న‌త‌నం నుంచే మ‌క్కువ ఎక్క‌వ‌. క్రికెట‌ర్ కాక‌పోయింటే క‌చ్చితంగా పైలట్ అయ్యే వాడ‌నని ఫిలిప్స్ ఇప్ప‌టికే చాలాసార్లు స్ప‌ష్టం చేశాడు. 

అంతేకాకుండా రిటైర్మెంట్ తీసుకున్న త‌ర్వాత ఏవియేషన్ రంగంలోనే సెటిల్ అవుతాన‌ని గ్లెన్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు. ఈ కివీస్ క్రికెట‌ర్ ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించ‌నున్నాడు.
చదవండి: షేన్‌ వార్న్‌ గొప్ప బౌలర్‌ కాదు! వరల్డ్‌కప్‌ ఫైనల్లో అలా శ్రీలంక గెలుపు!


 

 

Advertisement
 
Advertisement
Advertisement