IND vs NZ: 'అతడు అద్భుతమైన బౌలర్‌.. న్యూజిలాండ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు'

 Glenn Phillips Names India Star Who Might Trouble New Zealand Batters - Sakshi

వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టీ20లో శుక్రవారం టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు కివీస్‌ స్టార్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిఫ్స్‌ భారత బౌలింగ్‌ విభాగంపై ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌లో భారత బౌలింగ్‌ ఎటాక్‌లో లెగ్‌స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ కీలకపాత్ర పోషిస్తాడని ఫిలిఫ్స్‌ అభిప్రాయపడ్డాడు. విలేకరుల సమావేశంలో ఫిలిప్స్‌ మాట్లాడూతూ.. "టీ20 క్రికెట్‌లో ప్రతీ జట్టు సరైన లెగ్‌ స్పిన్నర్‌ కోసం వెతుకుతోంది.

మా జట్టుకు  ఇష్ సోధి రూపంలో మ్యాచ్‌ విన్నింగ్‌ లెగ్‌స్పిన్నర్‌ ఉన్నాడు. అదే విధంగా ఆఫ్గానిస్తాన్‌ రషీద్‌ ఖాన్‌ రూపంలో అద్భుతమైన లెగ్గీ ఉన్నాడు. లెగ్‌ స్పిన్నర్లు మ్యాచ్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇక టీమిండియాకు కూడా చాహల్‌ రూపంలో అద్భుతమైన మణికట్టు స్పిన్నర్‌ ఉన్నాడు.

అతడు ఈ సిరీస్‌లో మా బ్యాటర్లను ఇబ్బంది పెడతాడని నేను భావిస్తున్నారు. అదే విధంగా భారత్‌ బౌలింగ్‌ ఎటాక్‌లో అతడు కీలక పాత్ర పోషిస్తాడు. అతడికి  'స్కై' స్టేడియం వంటి  చతురస్రకార మైదానంలో బంతిని  రెండు వైపులా టర్న్‌ చేసే సత్తా ఉంది. అతడి బౌలింగ్‌లో బంతి ఎటువైపు వెళుతుందో అంచనా వేయడం చాలా కష్టం" అని అతడు పేర్కొన్నాడు.

టీ20 సిరీస్‌కు భారత జట్టు..
హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.

న్యూజిలాండ్‌ జట్టు:  
కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే (వికెట్‌ కీపన్‌), లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ (వన్డే). టామ్ లాథమ్ (వన్డే), డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి (టీ20). టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్ (టీ20) 

చదవండి: IND vs NZ: భారత అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 కష్టమే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top