
విలియమ్సన్‌తో రోంచి
పాకిస్తాన్ పురుషల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు ల్యూక్ రోంచి బాధ్యతలు చేపటనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతడితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. రోంచి కూడా పీసీబీ ఆఫర్‌పై ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రోంచి ప్రస్తుతం న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఒకవేళ పీసీబీ ఆఫర్‌ను అతడు అంగీకరిస్తే న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నాడు.
కాగా వన్డే ప్రపంచకప్ 2023లో లీగ్ దశలోనే ఇంటి బాట పట్టిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్‌లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. బాబర్ ఆజం పాకిస్తాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్ సైతం తన పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో గత డిసెంబర్, జనవరిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల కోసం మహమ్మద్ హఫీజ్ తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు.
అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్తాన్ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు ముందు తమ జట్టు హెడ్‌కోచ్ పదవిని భర్తీ చేసే పనిలో పీసీబీ పడింది. ఇప్పటికే ఆసీస్ దిగ్గజం షేన్ వాట్సన్, విండీస్ మాజీ కెప్టెన్ డారన్ సామిని హెడ్‌కోచ్ పదవి కోసం పీసీబీ సంప్రదించింది. కానీ పీసీబీ ఆఫర్‌ను వారిద్దరూ రిజక్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా ల్యూక్ రోంచితో పీసీబీ చర్చలు జరపుతోంది.
Luke Ronchi in talks with PCB for Pakistan's head coach position.#PakistanCricket pic.twitter.com/nelmZvVm2b
— Nawaz 🇵🇰🇦🇪 (@Rab_Nawaz31888) March 26, 2024