హైదరాబాద్‌కు భారీ షాక్‌.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్‌ ఆటగాడు

Former Hyderabad skipper Ravi Teja announces First Class retirement - Sakshi

హైదరాబాద్ మాజీ కెప్టెన్ ద్వారకా రవితేజ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్‌ మీడియా వేదికగా రవితేజ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. తన 16 ఏళ్ల ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో హైదరాబాద్, మేఘాలయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక రవితేజ భారత అండర్‌-19 జట్టుకు, భారత్‌-ఎ జట్టుకు కూడా ఆడాడు. ఈ క్రమంలో భారత అండర్‌-19 జట్టుకు, భారత్‌-ఎ జట్టుకు ఆడే అవకాశం కల్పించిన బీసీసీఐకు రవితేజ ధన్యవాదాలు తెలిపాడు. 2006లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ తరఫున రంజీల్లో అరంగేట్రం చేశాడు.

ఈ మ్యాచ్‌లో 84 పరుగులు చేసి అతడు అకట్టుకున్నాడు. ఇక తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ప్రస్తుతం జరుగుతోన్న రంజీట్రోఫీలో  గుజరాత్‌తో మేఘాలయ తరఫున ఆడాడు. ఈ మ్యాచ్‌లో 133 పరుగులు సాధించి తన కెరీర్‌కు ముగింపు పలికాడు. మరో వైపు 2008 ఐపీఎల్‌ తొలి సీజన్‌లో దక్కన్‌ ఛార్జర్స్‌ హైదరాబాద్‌ తరుపున ప్రాతినిథ్యం వహించాడు. ఇక 78 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన రవితేజ 4722 పరుగులు సాధించాడు. 85 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు ఆడిన అతడు 2942 పరుగులు చేశాడు.

చదవండి: Ind Vs SL 2nd Test - Day 1: ఇండియా వర్సెస్‌ శ్రీలంక రెండో టెస్టు అప్‌డేట్స్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top