ఆస్ట్రేలియాలో ఎంట్రీ యుద్ధభూమిని తలపించింది | Felt Like Going To War: Shubman Gill On Test Debut In Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో ఎంట్రీ యుద్ధభూమిని తలపించింది

Mar 11 2021 3:49 AM | Updated on Mar 11 2021 8:11 AM

Felt Like Going To War: Shubman Gill On Test Debut In Australia - Sakshi

అహ్మదాబాద్‌: భారత జట్టు తరఫున ఆడిన ఏడు టెస్టుల్లోనే తనదైన ముద్ర వేసిన యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఆస్ట్రేలియాలో అరంగేట్రం తనకు యుద్ధభూమిని తలపించిందని అన్నాడు. 21 ఏళ్ల గిల్‌ కంగారూ గడ్డపై రెండు అర్ధ సెంచరీలతో 259 పరుగులు చేశాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన గిల్‌ నాటి సంగతి గుర్తు చేస్తూ ‘మ్యాచ్‌లో మొదట ఫీల్డింగ్‌ చేస్తుంటే బాగానే అనిపించింది. కానీ బ్యాటింగ్‌ చేసేందుకు మైదానంలోకి దిగుతుంటే... అక్కడి ప్రేక్షకులు తమ జట్టుకు మద్దతుగా అరుస్తు న్నారు. నాకేమో కాస్త భయంగా... యుద్ధానికి వెళుతున్నట్లుగా అనిపించింది’ అని అన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement