ఇంగ్లండ్‌దే టి20 సిరీస్‌

England Won T20 Series Against Australia - Sakshi

సౌతాంప్టన్‌: ఓ మ్యాచ్‌ మిగిలుండగానే టి20 సిరీస్‌ను ఇంగ్లండ్‌ వశం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టి20లో ఇంగ్లండ్‌ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఫించ్‌ (33 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టొయినిస్‌ (26 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. క్రిస్‌ జోర్డాన్‌ 2 వికెట్లు పడగొట్టగా... ఆర్చర్, మార్క్‌వుడ్‌ చెరో వికెట్‌ తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 18.5 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్‌ బట్లర్‌ (54 బంతుల్లో 77 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కడదాకా క్రీజులో నిలబడి గెలిపించాడు. డేవిడ్‌ మలన్‌ (32 బంతుల్లో 42; 7 ఫోర్లు)తో కలిసి రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించాడు. అగర్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆఖరి టి20 రేపు (మంగళవారం) ఇక్కడే జరుగుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top