40 ఏళ్ల వయసులో తండ్రైన దినేష్‌ కార్తీక్‌ | Dinesh Karthik and wife Dipika Pallikal welcome baby girl | Sakshi
Sakshi News home page

Dinesh Karthik: 40 ఏళ్ల వయసులో తండ్రైన దినేష్‌ కార్తీక్‌

Mar 19 2026 11:45 AM | Updated on Mar 19 2026 1:47 PM

Dinesh Karthik and wife Dipika Pallikal welcome baby girl

టీమిండియా మాజీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ దినేష్ కార్తీక్ మ‌రోసారి తండ్ర‌య్యాడు. అత‌డి భార్య, స్టార్ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ పండింటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ పాపకు డికే-దీపికా జోడీ 'రాహా' అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

దీంతో అభిమానులు వారిద్ద‌రికి శుభకాంక్ష‌లు తెలుపుతున్నారు. కాగా ఈ జంటకు ఇప్ప‌టికే ఇద్ద‌రు కుమారులు(క‌వ‌ల‌లు) ఉన్నారు. 2021లో కబీర్, జియాన్ జన్మించారు. ఇప్పుడు 40 ఏళ్ల వ‌య‌సులో డికే మూడోసారి తండ్రి అయ్యాడు.

కాగా ఆల్‌ఫార్మాట్ క్రికెట్ విడ్కోలు ప‌లికిన  కార్తీక్.. ప్ర‌స్తుతం కామెంటేట‌ర్‌గా, కోచ్‌గా కొన‌సాగుతున్నాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కోచ్‌గా డీకే వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇక దీపికా విష‌యానికి వ‌స్తే.. ఆమె చివ‌ర‌గా ఆసియాగేమ్స్‌-2023లో మిక్సిడ్ డ‌బుల్స్‌లో బంగారు పతకంతో మెరిసింది.

అంత‌కుముందు వరల్డ్ డబుల్స్ ఛాంపియన్‌షిప్‌-2022లో రెండు స్వర్ణాలు ఆమె సాధించింది. దీంతో ఆమె సేవలకుగాను భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో స‌త్క‌రించింది.
చదవండి: T20 WC 2026: జోస్ బ‌ట్ల‌ర్ రిటైర్మెంట్‌..?

Advertisement
 
Advertisement
Advertisement