ఆఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం | CWC 2023 9th Match IND Vs AFG: India Vs Afghanistan Live Score Updates, Latest News And Highlights - Sakshi
Sakshi News home page

CWC 2023: ఆఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం

Oct 11 2023 3:36 PM | Updated on Oct 11 2023 9:01 PM

CWC 2023, 9th Match: India vs Afghanistan Updates And Highlights - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 35 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.

కేవలం 63 బంతుల్లోనే హిట్‌మ్యాన్‌ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఆఫ్గానిస్తాన్‌ బౌలర్లకు రోహిత్‌ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే రోహిత్‌ బౌండరీల వర్షం కురిపించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 84 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌.. 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. అతడితో పాటు విరాట్‌ కోహ్లి(55  నాటౌట్‌) హాఫ్‌ సెంచరీతో రాణించాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. రోహిత్‌ ఔట్‌
ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 84 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌.. 16 ఫోర్లు, 5 సిక్స్‌లు బాది 131 పరుగులు చేశాడు. భారత్‌ విజయానికి ఇంకా 66 పరుగులు కావాలి.

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
158 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 47 పరుగులు చేసిన ఇషాన్‌ కిషన్‌.. రషీద్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

సెంచరీతో చెలరేగిన రోహిత్‌ శర్మ..
ఆఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 63 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో రోహిత్‌ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా వరల్డ్‌కప్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ రికార్డులకెక్కాడు. 18 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 154/0

ఆఫ్గాన్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న రోహిత్‌..
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆఫ్గాన్‌ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. కేవలం 30 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 8 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 75/0

రాణించిన ఆఫ్గాన్‌ బ్యాటర్లు.. భారత్‌ టార్గెట్‌ 
వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌ బ్యాటర్లు పర్వాలేదనపించారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గానిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. 

ఆఫ్గాన్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ హష్మతుల్లా షాహిదీ(80) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్(62) పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్‌ పాండ్యా రెండు, కుల్దీప్‌, శార్థూల్‌ ఠాకూర్‌ తలా వికెట్‌ సాధించారు.
ఏడో వికెట్‌ డౌన్‌
ఆఫ్గానిస్తాన్‌ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 19 పరుగులు చేసిన నబీ.. బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

ఆరో వికెట్‌ కోల్పోయిన ఆఫ్గానిస్తాన్‌
ఆఫ్గానిస్తాన్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 2 పరుగులు చేసిన నజీబుల్‌ జద్రాన్‌.. బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 45 ఓవర్లకు ఆఫ్గాన్‌ స్కోర్‌: 234/6

ఐదో వికెట్‌ డౌన్‌
ఐదో వికెట్‌ డౌన్‌.. ఆఫ్గాన్‌ కెప్టెన్‌ ఔట్‌ 225 పరుగుల వద్ద ఆఫ్గానిస్తాన్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 80 పరుగులు చేసిన ఆఫ్గాన్‌ కెప్టెన్‌ షాహిది కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆఫ్గాన్‌..
184 పరుగుల వద్ద ఆఫ్గానిస్తాన్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 62 పరుగులు చేసిన అజ్మతుల్లా ఒమర్జాయ్.. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. 35 ఓవర్లకు ఆఫ్గానిస్తాన్‌ స్కోర్‌: 189/4

నిలకడగా ఆడుతోన్న ఆఫ్గాన్‌..
వరుసక్రమంలో వికెట్లు కోల్పోయిన ఆఫ్గానిస్తాన్‌ తిరిగి గాడిలో పడిం‍ది.  అజ్మతుల్లా ఒమర్జాయ్(50), షాహిది(45) అద్భుతంగా ఆడుతూ ఆఫ్గాన్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. 32 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్‌ 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

25 ఓవర్లకు ఆఫ్గాన్‌ స్కోర్‌: 114/3
25 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్‌ మూడు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజులో అజ్మతుల్లా ఒమర్జాయ్(25), షాహిది(25) ఉన్నారు.

మూడో వికెట్‌ డౌన్‌..
ఆఫ్గానిస్తాన్‌ రెహమత్‌ షా రూపంలో మూడో వికెట్ ​కోల్పోయింది. 16 పరుగులు చేసిన రెహమత్‌ షాను శార్థూల్‌ ఠాకూర్‌ పెవిలియన్‌కు పంపాడు. 18 ఓవర్లకు ఆఫ్గాన్‌ స్కోర్‌: 79/3

రెండో వికెట్‌ డౌన్‌..
63 పరుగుల వద్ద ఆఫ్గాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 21 పరుగులు చేసిన గుర్భాజ్‌.. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో​కి కెప్టెన్‌ షాహీది వచ్చాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆఫ్గనిస్తాన్‌..
టాస్‌ గెలిచి ‍బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గానిస్తాన్‌ 32 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 22 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్‌ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రెహమత్‌ షా వచ్చాడు. 8 ఓవర్లకు ఆఫ్గాన్‌ స్కోర్‌: 37/1

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా భారత్‌-ఆఫ్గానిస్తాన్‌ జట్లు తలపడతున్నాయి.  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆఫ్గానిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు రవిచంద్రన్‌ అశ్విన్‌కు భారత జట్టు మేనెజ్‌మెంట్‌ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానంలో శార్ధూల్‌ ఠాకూర్‌ తుది జట్టులో వచ్చాడు. మరోవైపు ఆఫ్గానిస్తాన్‌ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.

తుది జట్లు
భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్‌), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఆఫ్ఘనిస్తాన్: రెహ్మానుల్లా గుర్బాజ్‌ (వికెట్‌కీపర్‌), హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్‌ హక్ ఫారూకీ

Advertisement
 
Advertisement
Advertisement