IPL2021: ఐపీఎల్‌... ఓవర్‌ టూ యూఏఈ 

BCCI Vice President Rajeev Shukla Says IPL 2021 Moved To UAE - Sakshi

బీసీసీఐ ఎస్‌జీఎంలో ఏకగ్రీవ నిర్ణయం

ఇంకా తేదీలను ప్రకటించని బోర్డు

ప్రపంచకప్‌ నిర్వహణపై  నెల రోజుల తర్వాతే నిర్ణయం   

ముంబై: కరోనా కారణంగా వాయిదా పడిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మిగిలిన మ్యాచ్‌లను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. శనివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) అనంతరం బోర్డు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఏ తేదీల్లో నిర్వహిస్తామనే విషయంపై పూర్తి స్పష్టత రాలేదు. అయితే సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 12 మధ్య లీగ్‌ జరగవచ్చని బోర్డు వర్గాల సమాచారం.  2021 ఐపీఎల్‌లో 29 మ్యాచ్‌లు నిర్వహించిన అనంతరం అనూహ్యంగా ఆటగాళ్లకు కరోనా సోకడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ప్లే ఆఫ్స్‌ సహా లీగ్‌లో మరో 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. భారత్‌లో కరోనా తీవ్రత మరింత పెరిగిపోవడంతో ఈ సీజన్‌లో మన దేశంలో మాత్రం మ్యాచ్‌లు నిర్వహించలేమని స్పష్టమైంది.

దాంతో ప్రత్యామ్నాయ వేదికగా మరోసారి యూఏఈవైపే బీసీసీఐ చూసింది. 2020లో మొత్తం టోర్నీకి ఆతిథ్యమిచ్చిన దుబాయ్, అబుదాబి, షార్జా మైదానాల్లోనే ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే బీసీసీఐ అధికారిక ప్రకటనలో కోవిడ్‌–19 కారణంగా వేదిక మారినట్లు కాకుండా సెప్టెంబర్‌–అక్టోబర్‌ సమయంలో భారత్‌లో వర్షాకాలం కాబట్టి మ్యాచ్‌లు ఇబ్బంది కలగకుండా వేదిక మార్చినట్లు ఉండటం గమనార్హం. మరోవైపు తాజా షెడ్యూల్‌ ప్రకారం చూస్తే తమ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడరని ఇంగ్లండ్‌ బోర్డు ఇప్పటికే ప్రకటించగా... కీలకమైన ఆస్ట్రేలియా బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఎస్‌జీఎంలో విదేశీ ఆటగాళ్ల విషయంపై కూడా చర్చ జరిగింది. అయితే ఎవరు వచ్చినా రాకున్నా, ఏ బోర్డునూ బతిమాలబోమని, మిగిలిన మ్యాచ్‌లను పూర్తి చేయడమే లక్ష్యమని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే విండీస్‌ ఆటగాళ్ల కోసం కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని బోర్డు కోరినట్లు అంతర్గత సమాచారం. ఆటగాళ్లు ఎవరైనా అందుబాటులో లేకపోతే వారి స్థానాల్లో మరొకరిని తీసుకునేందుకు ఫ్రాంచైజీలను బోర్డు అనుమతిస్తుంది.  

హెచ్‌సీఏ నుంచి అజహరుద్దీన్‌...
సుదీర్ఘ వివాదం అనంతరం బీసీసీఐ వర్చువల్‌ సమావేశంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) తరఫున అధ్యక్షుడు మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ హాజరయ్యాడు. అజహర్‌ వైరి వర్గం కొన్నాళ్ల క్రితం హెచ్‌సీఏ ప్రతినిధిగా శివలాల్‌ యాదవ్‌ పేరును ప్రతిపాదించి పంపించినా... బోర్డు దానిని పట్టించుకోకుండా అజహర్‌కే అవకాశం కల్పించింది.

టి20 వరల్డ్‌కప్‌ కోసం వేచి చూద్దాం 
కరోనాతో ఐపీఎల్‌ విదేశానికి తరలి పోగా... అక్టోబర్‌–నవంబర్‌లోనే జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ను భారత్‌ నిర్వహించగలదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. 16 జట్లతో ఒక ఐసీసీ ఈవెంట్‌ను జరపడం అంత సులువు కాదు. అప్పటికి భారత్‌లో కోవిడ్‌–19 కేసుల పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు కానీ... పూర్తిగా వైరస్‌ తగ్గిపోతుందనుకోవడం కూడా అత్యాశే. అందుకే బోర్డు వేచి చూసే ధోరణిలో ఉంది. భారత్‌ నుంచి టి20 ప్రపంచకప్‌ను తరలించే ఆలోచనతో ఉన్న ఐసీసీని బీసీసీఐ మరో నెలరోజులు గడువు ఇవ్వాలని కోరనుంది.

వరల్డ్‌కప్‌ను సమస్యలు లేకుండా నిర్వహించే క్రమంలో ఒకే ప్రాంతంలో అన్ని మ్యాచ్‌లు నిర్వహించాలనే ఆలోచనతో కూడా బోర్డు ఉంది. ముంబైలోని మూడు స్టేడియాలతో పాటు దగ్గర్లోనే పుణేను వాడుకుంటే ఎలా ఉంటుందనేది ఒక సూచన. జూన్‌ 1న జరిగే ఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా దుబాయ్‌ వెళ్లనున్నారు. అక్కడే ఐపీఎల్‌ నిర్వహణ గురించి యూఏఈ బోర్డుతో కూడా చర్చిస్తారు. మరోవైపు రంజీ క్రికెటర్లకు నష్టపరిహారం ఇచ్చే అంశంపై ఈ సమావేశంలో ఎలాంటి చర్చా జరగలేదు.  

(చదవండి: IPL 2021: ఎప్పుడు నిర్వహిద్దాం?)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

29-05-2021
May 29, 2021, 01:45 IST
ముంబై: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌–2021లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న బీసీసీఐ నేడు...
27-05-2021
May 27, 2021, 22:05 IST
ఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున దుమ్మురేపిన సంగతి తెలిసిందే. మరో...
26-05-2021
May 26, 2021, 02:35 IST
న్యూఢిల్లీ: మిగిలిన ఐపీఎల్‌ టి20 టోర్నమెంట్‌ మ్యాచ్‌లను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. రోజూ రెండేసి...
25-05-2021
May 25, 2021, 15:40 IST
చెన్నై: కరోనా మహమ్మారి సెగతో ఐపీఎల్‌ 14వ సీజన్‌ను బీసీసీఐ మధ్యలోనే రద్దు చేసిన సంగతి తెలిసిందే. కేకేఆర్‌ ఆటగాళ్లు వరుణ్‌...
17-05-2021
May 17, 2021, 07:27 IST
చెన్నై: చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు బ్యాటింగ్‌ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మైక్‌ హస్సీ ఎట్టకేలకు స్వదేశానికి బయలు...
15-05-2021
May 15, 2021, 11:40 IST
పరిస్థితులు ఒక్కసారిగా తారుమారైపోయాయి. చార్టర్‌ ఫ్లైట్లలో ప్రయాణాలు చేసినప్పటికీ ఇతర సిబ్బంది కూడా మాతోనే ఉంటారు కదా
14-05-2021
May 14, 2021, 19:20 IST
ఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు.. సీఎస్‌కు బ్యాటింగ్‌ కోచ్‌ మైకెల్‌ హస్సీ కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలో...
13-05-2021
May 13, 2021, 14:52 IST
సిడ్నీ: క్లిష్ట పరిస్థితుల్లోనూ డేవిడ్‌ వార్నర్‌ ఏమాత్రం సహనం కోల్పోకుండా ఎంతో హుందాగా వ్యవహరించాడని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అసిస్టెంట్‌ కోచ్‌...
12-05-2021
May 12, 2021, 15:40 IST
ముంబై: ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లు లేకపోతే లీగ్‌కు స్టార్‌ కళ ఉండదు. మన టీమిండియా ఆటగాళ్లు ఎంతమంది ఉన్నా విదేశీ ఆటగాళ్లు...
12-05-2021
May 12, 2021, 13:24 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్‌-2021 వాయిదా పడటంతో పలు ఫ్రాంఛైజీలు సోషల్‌ మీడియా వేదికగా తమ ఆటగాళ్ల వీడియోలు పోస్ట్‌ చేస్తూ ఆనందం...
11-05-2021
May 11, 2021, 18:42 IST
ఢాకా: బయోబబుల్‌ తనకు నరకంలా కనిపించిందని బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ తెలిపాడు. కొన్ని నెలలుగా బమోబబూల్‌లో ఉంటూ మ్యాచ్‌లు ఆడడం...
11-05-2021
May 11, 2021, 17:52 IST
ముంబై: మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఎంపిక చేసిన ఐపీఎల్ 2021 సీజన్ ప్లెయింగ్‌ ఎలెవెన్‌ జట్టులో ఎంఎస్‌ ధోని,విరాట్ కోహ్లీ,...
11-05-2021
May 11, 2021, 14:47 IST
లండన్‌: ‘‘నేను భారత్‌ను వదిలిపెట్టి వచ్చాను కానీ.. నా మనసంతా అక్కడే ఉంది. నాపై ఎంతో ప్రేమను కురిపించిన, ఆప్యాయత...
11-05-2021
May 11, 2021, 08:56 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ సమయంలో కరోనా బారిన పడిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ క్రికెటర్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్స్‌ తమ స్వస్థలాలకు...
10-05-2021
May 10, 2021, 18:37 IST
న్యూఢిల్లీ: అవేశ్‌ ఖాన్‌.. ఐపీఎల్‌-14 సీజన్‌లో అందర్నీ ఆకర్షించిన బౌలర్‌. మధ్యప్రదేశ్‌కు ఈ చెందిన ఈ పేస్‌బౌలర్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు...
10-05-2021
May 10, 2021, 11:36 IST
కోల్‌కతా: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు ప్యాట్‌ కమిన్స్‌ తండ్రి కాబోతున్నాడు. కమిన్స్‌ ప్రేయసి, కాబోయే భార్య...
10-05-2021
May 10, 2021, 08:22 IST
కోల్‌కతా: ఈ ఏడాది జూలైలో భారత జట్టు శ్రీలంక లో పర్యటించి మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో...
09-05-2021
May 09, 2021, 22:26 IST
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఒకవేళ లీగ్‌ను నిర్వహించలేకపోతే బీసీసీఐకి...
09-05-2021
May 09, 2021, 16:32 IST
ముంబై: దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్‌ డికాక్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా కరోనా మహమ్మారి కారణంగా...
08-05-2021
May 08, 2021, 15:06 IST
న్యూఢిల్లీ: గత సంవత్సరం యూఏఈలో మ్యాచ్‌లు జరిపిన మాదిరిగానే భారత్‌లోనూ ఈ సారి ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించాలనుకున్న బీసీసీఐ ప్రయత్నాలు విఫలమయ్యాయి. పక్కాగా జాగ్రత్తలు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top