
IPL 2022 Will Be Held In India Says Sourav Ganguly: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2022) భారత్‌లోనే జరగాలని కోరుకుంటున్నానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ భారత టోర్నీ అని, అందుకే భారత అభిమానులు ఈ లీగ్ స్వదేశంలో జరగాలని కోరుకుంటున్నారని అన్నాడు. 2022 సీజన్‌కు ఇంకా 8 నెలల సమయం ఉందని, అప్పటిలోగా దేశంలో కరోనా పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ తొలి దశ మ్యాచ్‌లు భారత్‌లోనే జరిగినప్పటికీ.. కరోనా కారణంగా లీగ్ వాయిదా పడి యూఏఈకి తరలి వెళ్లింది.
చదవండి: 17 ఏళ్ల తర్వాత పాక్‌లో పర్యటించనున్న టీమిండియా..!