మళ్లీ ఆసుపత్రిలో చేరిన గంగూలీ

 BCCI Chief Sourav Ganguly being taken to Apollo Hospital  - Sakshi

సాక్షి, కోలకతా: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆయనకు మళ్లీ ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన  కోలకతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇటీవల గుండెపోటుకు  గురై , కోలుకున్న దాదా మళ్లీ ఆసుపత్రిలో చేరారన్న వార్త క్రికెట్‌ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, గంగూలీకి మంగళవారం ఛాతీలో కొంచెం నొప్పిగా అనిపించింది. కానీ బుధవారం ఆ నొప్పి మరింత పెరగడంతో గ్రీన్ కారిడార్ ద్వారా ముందు జాగ్రత్తగా గంగూలీని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. (ఆస్పత్రి నుంచి సౌరవ్‌ గంగూలీ డిశ్చార్జ్)

కాగా ఇటీవల (జనవరి, 2) గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ  చికిత్స అనంతరం జనవరి 7వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. స్వల్ప గుండెపోటుతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరిన గంగూలీకి వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే.  (గంగూలీకి మరో రెండు బ్లాక్స్‌.. 24 గంటలు అబ్జర్వేషన్‌లోనే)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top