అశ్విన్‌ అన్నతో ఆటలా.. దిమ్మతిరిగిపోయిందిగా! వీడియో వైరల్‌ | Bairstow Tries To Reverse Sweep The Carron Ball From Ashwin, Umpire Declared Him Out Video Viral, See Netizens Reactions - Sakshi
Sakshi News home page

IND Vs ENG 4th Test: అశ్విన్‌ అన్నతో ఆటలా.. దిమ్మతిరిగిపోయిందిగా! వీడియో వైరల్‌

Published Fri, Feb 23 2024 1:16 PM | Last Updated on Fri, Feb 23 2024 1:43 PM

Ashwin Outfoxes Bairstow, vedio viral - Sakshi

టీమిండియాతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌ స్టో తన పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. తొలి మూడు టెస్టుల్లో విఫలమైన బెయిర్‌ స్టో.. ఇప్పుడు రాంఛీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులోనూ అదే తీరును కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసి బెయిర్‌ స్టో ఔటయ్యాడు. ఇంగ్లండ్‌ 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన బెయిర్‌ స్టో.. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.

ఈ క్రమంలో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ను ఎటాక్‌లోకి తీసుకుచ్చాడు. అయితే అశ్విన్‌ను తన తొలి ఓవర్‌ నుంచే ఎటాక్‌ చేయడానికి బెయిర్‌ స్టో ప్రయత్నించాడు. ఈ క్రమంలో 20 ఓవర్‌ వేసిన అశ్విన్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాదిన బెయిర్‌ స్టో.. తనదే పై చేయి అన్నట్లు రియాక్షన్‌ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ 22 ఓవర్‌ బౌలింగ్‌ చేయడానికి అశూ వచ్చాడు.

ఆ ఓవర్‌ తొలి బంతినే బౌండరీగా మలిచిన జానీ.. రెండో బంతిని సైతం ఫోర్‌ కొట్టడానికి ప్రయత్నించాడు. అశ్విన్‌ వేసిన క్యారమ్‌ బాల్‌కు రివర్స్‌ స్వీప్‌ ఆడటానికి బెయిర్‌ స్టో ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్‌ అయ్యి అతడి ప్యాడ్‌కు తాకింది. వెంటనే బౌలర్‌తో పాటు వికెట్‌ కీపర్‌ ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్‌ నాటౌట్‌ అంటూ తల ఊపాడు.

వెంటనే రోహిత్‌ శర్మ డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. రీప్లేలో బంతికి మిడిల్‌ స్టంప్‌ను హిట్‌ చేస్తున్నట్లు తేలింది. దీంతో ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని వెన​క్కి తీసుకుంటూ ఔట్‌గా ప్రకటించాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అశ్విన్‌ అన్నతో ఆటలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అంతకముందు రెండో టెస్టు సమయంలోనూ వీరిద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకున్నసంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement