
అబుదాబి: వరల్డ్‌కప్ క్రికెట్ సూపర్ లీగ్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే అఫ్గానిస్తాన్ సొంతం చేసుకుంది. ఐర్లాండ్‌తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత ఐర్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (129; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. నవీన్ ఉల్ హక్ నాలుగు, ముజీర్ ఉర్ రహమాన్ మూడు వికెట్లు పడగొట్టారు. 260 పరుగుల లక్ష్యాన్ని అఫ్గానిస్తాన్ 45.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రహ్మత్ షా (103 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేయగా... హష్మతుల్లా షాహిది (82; 8 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించాడు. చివరిదైన మూడో వన్డే మంగళవారం జరుగుతుంది.