మూడేళ్లలో ఒలింపిక్స్‌ అంటే కొంత కష్టమే! | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో ఒలింపిక్స్‌ అంటే కొంత కష్టమే!

Published Fri, Aug 20 2021 8:25 AM

Abhinav Bindra Says Three-Year Olympic Cycle Will Be Tricky - Sakshi

ఢిల్లీ: సాధారణంగా నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈ సారి మూడేళ్లకే ఒలింపిక్స్‌ రానుండటం ఆటగాళ్ల సన్నాహకాలపై కొంత ప్రభావం చూపుతుందని షూటింగ్‌ దిగ్గజం అభినవ్‌ బింద్రా అభిప్రాయ పడ్డాడు. సాధారణంగా ఒలింపిక్స్‌ ముగిసిన తర్వాత ఆటగాళ్లంతా విశ్రాంతి అనంతరం పూర్తి స్థాయిలో కోలుకునేందుకు తొలి ఏడాదిని వాడుకుంటారని, ఇప్పుడు తొందరగా దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నాడు.   

క్వార్టర్స్‌లో శ్రీజపై మనిక గెలుపు 
వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ కంటెండర్‌ టోర్నీలో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ క్వార్టర్‌ ఫైనల్లో పరాజయం చవిచూసింది. బుడాపెస్ట్‌ (హంగేరి)లో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో భారత్‌కే చెందిన మనిక బాత్రా 3–2 (7–11, 11–18, 8–11, 13–11, 11–6)తో శ్రీజపై గెలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మనిక–సత్యన్‌ జంట టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. సెమీస్‌లో ఈ జోడి 3–0 (11–6, 11–5, 11–4)తో అలియక్సండర్‌– డారియా ట్రిగొలొస్‌ (బెలారస్‌) జంటపై గెలిచింది. ఫైనల్లో భారత ద్వయం హంగేరికి చెందిన నండోర్‌– డోరియా మదరస్జ్‌ జోడీతో తలపడుతుంది.   

Advertisement
Advertisement