
పీఎల్-2022లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమవుతన్నాడు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లలో ఇషాన్ అదరగొట్టినా(ఢిల్లీపై 81 పరుగులు- నాటౌట్, రాజస్తాన్ రాయల్స్‌పై 54 పరుగులు) దానిని కొనసాగించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో మ్యాచ్‌లు ఆడిన కిషన్ 199 పరుగులు సాధించాడు. ఇక ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కిషన్‌కు విశ్రాంతి ఇవ్వాలని భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
"ఇషాన్ కిషన్‌కు వెంటనే విశ్రాంతి ఇవ్వాలి. అతడు ఫామ్‌లో లేడు. క్రీజులో స్ట్రగుల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అతడు అద్భుతమైన ఆటగాడు. కిషన్ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయడంలేదు. కాబట్టి ఒకటెండ్రు మ్యాచ్‌లకు పక్కన పెడితే బాగుటుంది అని చోప్రా పేర్కొన్నాడు.