Reports: 66 Year Old Ex Indian Cricketer Arun Lal Set To Get Married For Second Time - Sakshi
Sakshi News home page

Arun Lal Second Marriage: భార్యను ఒప్పించి రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ క్రికెటర్‌

Apr 25 2022 6:06 PM | Updated on Apr 25 2022 6:46 PM

66 Year Old Ex India Cricketer Set To Marry 38 Year Old Woman - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బెంగాల్ రంజీ జట్టు హెడ్ కోచ్ అరుణ్ లాల్ 66 ఏళ్ల లేటు వయసులో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అనారోగ్యంగా ఉన్న మొదటి భార్యను ఒప్పించి మరీ ఆయన ఈ కార్యానికి రెడీ అయ్యాడు. అరుణ్ లాల్.. తనకు చాలాకాలంగా పరిచయమున్న బుల్ బుల్ సాహ (బెంగాల్‌) అనే మహిళ (38)ను మే 2న మనువాడబోతున్నాడు. కోల్‌కతాలోని పీర్లెస్ ఇన్‌లో వీరి వివాహం జరుగనుంది. ఈ మేరకు అరుణ్‌ లాల్ ఇప్పటికే  తనకు కావాల్సి వారికి ఆహ్వానం పంపాడు.  
 


అరుణ్ లాల్.. అనారోగ్యంతో బాధపడుతున్న తన మొదటి భార్య రీనాకు చాలాకాలం క్రితమే విడాకులు ఇచ్చాడు. విడాకులు తీసుకున్నా మంచానికే పరిమితం కావడంతో ఆమె అరుణ్ లాల్‌తోనే జీవిస్తుంది. రీనాకు అరుణ్‌ లాల్‌ మనువాడబోయే బుల్ బుల్‌తో కూడా సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, అరుణ్‌ లాల్‌ భారత్ తరఫున 1982-89 మధ్యకాలంలో 16 టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోయినా అరుణ్‌.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మెరుగ్గా ఆడాడు. 156 మ్యాచ్‌ల్లో 30 శతకాల సాయంతో 10421 పరుగులు సాధించాడు. 
చదవండి: PBKS VS CSK: నాలుగు భారీ రికార్డులపై కన్నేసిన శిఖర్‌ ధవన్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement