Chess Olympiad 2022: పాలస్తీనా చిన్నది... టోర్నీలోనే పిన్నది  

44th Chess Olympiad: Meet Youngest Participant Randa Seder From Palestine - Sakshi

చెన్నైకొచ్చిన 8 ఏళ్ల పాలస్తీనా పాప రాండా సెడార్‌. అసలు ‘ఎత్తు’ వేయకుండానే ఈ ‘చెస్‌ ఒలింపియాడ్‌’ పుస్తకాల్లోకెక్కింది. చెన్నై  మెగా ఈవెంట్‌లో ఆడుతున్న అతిపిన్న వయస్కురాలిగా ఘనత పొందింది. ఐదేళ్ల పసిప్రాయంలో తండ్రి దగ్గర ఏదో ఆటవిడుపుగా నేర్చుకున్న చదరంగంలో అసాధారణ ప్రావీణ్యం సంపాదించింది. మూడేళ్లు తిరిగేసరికే పాలస్తీనా మహిళల చాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో నిలిచి... ఈ ఒలింపియాడ్‌లో ఆడే జాతీయ జట్టుకు ఎంపికైంది. 

మయన్మార్‌ అమరవట్టి... మన కుట్టి! 


భారత సంతతికి చెందిన 11 ఏళ్ల మయన్మార్‌ అమ్మాయి కూడా చెన్నైలో ప్రత్యర్థులకు చెక్‌ పెట్టేందుకు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా మయన్మార్‌ అబ్బాయిలే ‘పావులు’ కదుపుతున్న చెస్‌ ఒలింపియాడ్‌ చరిత్రలో తొలిసారి అమ్మాయిల జట్టు ఆడుతోంది. అరంగేట్రం చేస్తున్న అమ్మాయిల బృందంలో ఉన్న మిన్‌ అమరవట్టి తన మూలాలున్న చోట ఘనాపాఠిగా నిలిచేందుకు తహతహలాడుతోంది. 

చదవండి: Chess Olympiad 2022: భారత్‌పై విషం చిమ్మిన పాకిస్తాన్‌..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top