ఏం తెలివిరా నాయనా.. పోలీసులే షాక్‌ అయ్యారు | Shocking Video Of Thief Stealing From Parked Car Goes Viral | Sakshi
Sakshi News home page

ఏం తెలివిరా నాయనా.. పోలీసులే షాక్‌ అయ్యారు

Jan 7 2021 5:36 PM | Updated on Jan 7 2021 8:07 PM

Shocking Video Of Thief Stealing From Parked Car Goes Viral - Sakshi

కొందరికి చాలా మంచి తెలివితేటలుంటాయి. కానీ వాటిని మంచి పని కోసం వాడరు. ఈ కోవకు చెందిన వాడే ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వ్యక్తి. దొంగతనం చేయడం కోసం అతడు చూపిన తెలివితేటలు.. మంచి మార్గంలో బతకడానికి వాడితే ఎంత గొప్పవాడు అయ్యేవాడో అంటున్నారు నెటిజనులు. ప్రస్తుతం ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. చూడండి. ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు పక్కకు కారు ఆపి ఆపుతాడు. ఇది గమనించిన  సదరు దొంగ ఆ కారులో ఏవైనా విలువైన వస్తువులు ఉంటే వాటిని దొంగిలించాలని భావించి.. కారు దగ్గరకు వస్తాడు. ఇక డ్రైవర్‌ కారు దిగి లాక్‌ చేస్తుండగా.. సదరు దొంగ ఎంతో చాకచక్యంగా రేర్‌ డోర్‌ కొద్దిగా తెరిచి.. ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక కార్‌ లాక్‌ అయ్యిందని భావించిన డ్రైవర్‌ ఎదురుగుండా ఉన్న బిల్డింగ్‌లోకి వెళ్తాడు. (చదవండి: ‘బ్యాండ్‌ బజా బరాత్’‌.. ఒక్కరికి రూ.12 లక్షలు)

ఇది గమనించిన దొంగ చుట్టపక్కల ఓ సారి చూసి.. ఎవరు తనను గమనించడంలేదని భావించి.. ఇక నెమ్మదిగా వెళ్లి రేర్‌ డోర్‌ తెరుస్తాడు. కారు లోపలికి వెళ్లి దానిలో ఉన్న ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌, జాకెట్‌ తీసుకుని దర్జగా పక్క డోర్‌ నుంచి బయటకు వస్తాడుడు. ఎంతో తెలివిగా దొంగతనం చేసిన ఈ వ్యక్తి ప్రతిభకు నెటిజనులు షాక్‌ అవుతున్నారు. ఇలాంటి తెలివితేటల్ని మంచి పనులకు వాడితే బాగుంటుంది కదా అంటూ సలహాలిస్తున్నారు. ఇక ఈ తతంగం అంతా అక్కడి సీసీకెమరాలో రికార్డయ్యింది. ఆ తర్వాత సదరు డ్రైవర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించి.. దొంగ తెలివితేటలకు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ వీడియోను గత ఏడాది డిసెంబరులో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా తెగ వైరలవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement