తాలు తీసి తీసుకురండి..
దుబ్బాకరూరల్: ధాన్యాన్ని తాలు తీసి తీసుకురావాలని చీకోడ్ మిల్లు యజమాని సతీశ్ తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని రాజక్కపేట ఎల్లాపూర్ కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం లారీ లోడ్ వచ్చిందన్నారు. ధాన్యం బస్తాలను చెక్ చేయగా అంతా తాలు, దుమ్ముధూళి ఉందన్నారు. క్వింటాల్‌కు 5 కిలోలు కట్ చేస్తున్నారని, కొంత మంది పని గట్టుకుని రైతులను రెచ్చగొట్టి దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.
దుబ్బాకరూరల్: వరి పంట కోసి పదిహేను రోజులు గడుస్తున్నప్పటికీ కొనడం లేదంటూ రైతులు ఆగ్రహించారు. శనివారం మండలంలోని హబ్సిపూర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఏ ఒక్క అధికారి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన పాపాన పోవడంలేదన్నారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సీఐ రాజేశ్, ఎస్‌ఐ కీర్తిరాజ్ రైతుల వద్దకు చేరుకుని నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.


