ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

May 3 2026 10:16 AM | Updated on May 3 2026 10:16 AM

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

గజ్వేల్‌: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శనివారం గజ్వేల్‌ మండలం రిమ్మనగూడలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో గజ్వేల్‌ మండలం అక్కారం కాంగ్రెస్‌ నాయకులు సింగర్‌ ఎల్లంతోపాటు పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు. హరీశ్‌రావు వారికి బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డిలతో కలిసి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేరని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను తుంగలోకి తొక్కి.. కాంగ్రెస్‌ ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అసంబద్ధ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు బెండె మధు, పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా, బాల్‌చంద్రం, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement