కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి 18 రోజులవుతోంది. తొమ్మిది రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అయినా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో నాతోపాటు చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో మాదిరిగా కొనుగోళ్లు చేపట్టాలి. అకాల వర్షాలతో ధాన్యం తడిసి పోయే అవకాశం ఉంది.
– రేణికుంట వెంకటేశ్, రైతు, రాఘవాపూర్
కొనుగోళ్లు సాగుతున్నాయి
కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఎలాంటి సమస్యలు లేవు. ధాన్యంలో తాలు లేకుండా చూడాలని రైతులను కోరుతున్నాం. ధాన్యం డబ్బులు సైతం రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి.
– గోపికృష్ణ, డీఎం,
సివిల్ సప్లయ్ కార్పొరేషన్
కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి 15 రోజులు అవుతుంది. కేంద్రం ప్రారంభించి పది రోజులైనా ఇప్పటికీ గింజ ధాన్యం కూడా కొనలేదు. అధికారులను అడిగితే ఇంకా ఆదేశాలు రాలేదని సమాధానం చెబుతున్నారు. కొనుగోలు కేంద్రంలో తాలు తీసే మిషిన్లు లేవు. హమాలీ కార్మికులు కూడా అందుబాటులో లేరు. గన్ని సంచులకూ దిక్కులేదు.
– చెరుకూరి మల్లేశం,
రైతు, మల్లాయిపల్లి, దుబ్బాక


