ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధాని సభ నేపథ్యంలో శనివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో విస్తృత స్థాయి సన్నాహక కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని సభకు ప్రతి మండలం నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. త్వరలో సిద్దిపేటలో మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్ రావు


