ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026

Mar 29 2026 8:54 AM | Updated on Mar 29 2026 8:54 AM

ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026

ఆధునిక సాగుతో అధిక లాభాలు: వీసీ

ములుగు(గజ్వేల్‌): రైతులు ఆధునిక పరిజ్ఞానాన్ని సాగులో ఉపయోగించడం ద్వారా ఖర్చులు తగ్గి అధిక దిగుబడిని పొందవచ్చని కొండాలక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ రాజిరెడ్డి అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం పరిధిలోని షెడ్యూల్‌ కులాల ఉప ప్రణాళిక కింద శనివారం రైతు విజ్ఞాన యాత్రను ప్రారంభించి మాట్లాడారు. భవిష్యత్తులో ఉద్యాన పంటలకు మరింత ఆదరణ ఉంటుందని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా మేలైన వర్షాలతో రైతులు పత్తి, వరి పంటలను అధికంగా సాగు చేస్తున్నారని, ఎల్‌నినో నేపథ్యంలో అన్ని పంటలతో పోలిస్తే కూరగాయల సాగే తక్కువ నీటితో సాధ్యమన్నారు. గోదావరి, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని భూములు సారవంతంగా, నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో ఈ ప్రాంతంలో కూరగాయల సాగు ఇంకా లాభదాయకమని వివరించారు. రైతులు రసాయనాలు తగ్గించి జీవన ఎరువులు తయారు చేసుకోవాలని సూచించారు. బిందు సేధ్యంతో తక్కువ నీటితో వేసవిలో సైతం ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేసుకోచ్చునని తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, రైతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

పొరుగు జిల్లాల్లో ఖరారు

నేతల మధ్య సమన్వయం లేకసిద్దిపేట పెండింగ్‌

నాలుగు నెలలుగా అధ్యక్షురాలు ఒక్కరే..

చోటు కోసం ఆశగాఎదురుచూస్తున్న పార్టీ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement