గజ్వేల్: రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం గజ్వేల్ మండలం అహ్మదీపూర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రైతులతో కలిసి ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యుత్‌శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో రైతులకు 24గంటలపాటు నిరంతర విద్యుత్ సరఫరాను ఇచ్చి అండగా నిలిస్తే నేడు.. రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యుత్ కోతలు, సరఫరాలో లోవోల్టేజీ సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెడితే సహించేదిలేదని, వారి పక్షాన బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరాడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్, రైతుబంధు సమితి గజ్వేల్ మండలశాఖ మాజీ అధ్యక్షుడు రాజిరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు రమేష్‌గౌడ్, అహ్మద్, నిజామొద్దీన్, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


