ఏప్రిల్‌ 2 నుంచి గ్రామసభలు | - | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 2 నుంచి గ్రామసభలు

Mar 29 2026 8:54 AM | Updated on Mar 29 2026 8:54 AM

అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌

సిద్దిపేటరూరల్‌: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఏప్రిల్‌ 2 నుంచి జిల్లావ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌హమీద్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి వారి నుంచి అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. జిల్లా, డివిజన్‌, మండలం, గ్రామస్థాయి వరకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో చేపట్టిన పనులు ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, డీఆర్‌డీఓ జయదేవ్‌ఆర్యా, జెడ్పీ సీఈఓ రమేశ్‌, డీపీఓ రవీందర్‌, ఆర్డీఓ లక్ష్మణ్‌, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, డీడబ్ల్యూఓ శారద, హౌసింగ్‌ పీడీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బంది కలగకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి సరాఫరా సక్రమంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement