భారీ జనసందోహంతో వచ్చి..
కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి, కొండపాక మండలాల్లో మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం అభ్యర్థులు మద్దుతు దారులు, ప్రజలు, నాయకులతో భారీ సంఖ్యలో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. మంగోల్, తిప్పారం సర్పంచ్, వార్డు స్థానాల్లో అభ్యర్థులు కొందరు పెద్ద సంఖ్యలో ప్రజల, నాయకులతో తరలివచ్చి నిమినేషన్లను వేశారు. మండల వ్యాప్తంగా సర్పంచ్‌లకు.. 37, వార్డు స్థానాల కోసం 184 నామినేషన్‌న్లు దాఖలయ్యాయి. కుకునూరుపల్లి మండల వ్యాప్తంగా సర్పంచ్‌లకు 17, వార్డు సభ్యుల కోసం 58 నామినేషన్లు దాఖలయ్యాయని ఎంపీడీఓలు వెంకటేశ్వర్లు, రాంప్రసాద్‌లు పేర్కొన్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


