దాడులను అరికట్టడంలో విఫలం
గజ్వేల్: జిల్లాలో జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ దాడులను అరికట్టడంలో పోలీసు, రెవెన్యూశాఖల అధికారులు విఫలమవుతున్నారని దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్ ఆరోపించారు. గురువారం గజ్వేల్‌లోని అంబేడ్కర్ భవన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తే.. సరైన న్యాయం జరగడం లేదన్నారు. పోలీసు కమిషనర్ జోక్యం చేసుకుంటే తప్పా నిందితులను అరెస్ట్ చేయడం లేదన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో 81మంది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులు ఉన్నారని చెప్పారు. వీరికి రూ.1.5కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉన్నదన్నారు. సమావేశంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండస్వామి, జాతీయ ప్రజా ఉద్యమాల వేదిక రాష్ట్ర నాయకులు జాన్ మైకేల్, సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు అపర్ణ, హేమలత, దళిత ఉద్యోగుల సంఘం నాయకులు పి. ఎల్లయ్య, డీబీఎఫ్ జిల్లా కార్యదర్శి వేణు, ముస్లిం హక్కుల సంఘం నాయకుడు కాశీం, న్యాయవాది బత్తుల రాజు తదితరులు పాల్గొన్నారు.
డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్


